వామ్మో.. యాపిల్ టీతో ఇన్ని రోగాలకు చెక్ పెట్టవచ్చా..?
TeluguStop.com
ఏడాది పొడవునా లభ్యమయ్యే పండ్లలో యాపిల్( Apple ) ఒకటి.రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటుంటారు.
ఎందుకంటే యాపిల్ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ముఖ్యమైన పోషకాలు నిండి ఉంటాయి.
అయితే యాపిల్ మాత్రమే కాదండోయ్ యాపిల్ టీ( Apple Tea ) కూడా ఆరోగ్యకరమే.
రోజుకు ఒక కప్పు యాపిల్ టీ తాగడం వల్ల అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరి ఇంకెందుకు ఆలస్యం యాపిల్ టీ ఎలా తయారు చేసుకోవాలి.? అది అందించే ప్రయోజనాలు ఏంటి.
? అన్నది తెలుసుకుందాం పదండి. """/" /
ముందుగా ఒక చిన్న సైజు యాపిల్ తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, అంగుళం దాల్చిన చెక్క,( Cinnamon ) పది ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint Leaves ) వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత ఒక బ్లాక్ టీ బ్యాగ్ వేసి మరో ఐదు నిమిషాల పాటు బాయిల్ చేస్తే మన యాపిల్ టీ అనేది రెడీ అవుతుంది.
స్టవ్ ఆఫ్ చేసుకుని టీ ను ఫిల్టర్ చేసి తాగేయడమే. """/" /
సీజన్ ఏదైనా కూడా మార్నింగ్ తాగడానికి యాపిల్ టీ మంచి ఎంపిక అవుతుంది.
ఆపిల్ టీలో ఉండే ఆరోగ్యకరమైన సమ్మేళనాలు శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
యాపిల్ టీలో అధిక మొత్తంలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి.
ఇవి.బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడతాయి.
యాపిల్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి తోడ్పడుతుంది.
అంతేకాదండోయ్ యాపిల్ టీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.ఫలితంగా గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
యాపిల్ టీ శరీరంలో అదనపు కొవ్వును కాల్చడానికి, వెయిట్ లాస్ కు మద్దతు ఇస్తుంది.
మరియు ఒత్తిడిని దూరం చేసి మైండ్ ను రిలాక్స్ చేసే సత్తా కూడా యాపిల్ టీకి ఉంది.
బన్నీ పుష్ప2 మూవీ టార్గెట్ లెక్కలివే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే అంత రావాలా?