ర‌క్త‌హీన‌త‌, గుండె పోటుకు అడ్డుక‌ట్ట వేసే సూప‌ర్ జ్యూస్ ఇది..మీరు తీసుకోండి!

డ్రై ఆప్రికాట్స్‌.వీటి గురించి ప్రత్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

అద్భుత‌మైన డ్రై ఫ్రూట్స్‌లో డ్రై ఆప్రికాట్స్ ఒక‌టి.వీటిలో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐర‌న్‌, విటమిన్ ఎ, విటమిన్ సి, విట‌మిన్ బి వంటి ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు పుష్కలంగా నిండి ఉంటాయి.

అవి మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో మేలు చేస్తాయి.అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

అయిన‌ప్ప‌టికీ చాలా మంది డ్రై ఆప్రికాట్స్‌ను తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా డ్రై ఆప్రికాట్స్‌తో జ్యూస్‌ను తయారు చేసుకుని తీసుకుంటే.

వివిధ ర‌కాల జ‌బ్బులు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.మ‌రి లేటెందుకు ఆ సూప‌ర్ జ్యూస్ ఎలా త‌యారు చేసుకోవాలో చూసేయండి.

ముందుగా ఒక గిన్నెలోకి ఐదు డ్రై ఆప్రికాట్స్‌ను తీసుకుని వాట‌ర్‌తో ఒక‌సారి వాష్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత అందులో ఒక క‌ప్పు హాట్ వాట‌ర్ పోసి ఐదు గంట‌ల పాటు నాన‌బెట్టుకోవాలి.

ఇలా నాన‌బెట్టుకున్న డ్రై ఆప్రికాట్స్‌ను వాట‌ర్‌తో స‌హా బ్లెండ‌ర్‌లో వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ కాచి చ‌ల్లార్చిన పాలు, రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఇందులో వ‌న్ టేబుల్ స్పూన్ బాదం ప‌లుకులు, వ‌న్ టేబుల్ స్పూన్ పిస్తా ప‌లుకులు, వ‌న్ టేబుల్ స్పూన్ జీడిప‌ప్పు ప‌లుకులు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే డ్రై ఆప్రికాట్‌ జ్యూస్ సిద్ధ‌మైన‌ట్లే.

వారంలో క‌నీసం రెండు సార్లు ఈ జ్యూస్‌ను గ‌నుక తీసుకుంటే.అందులో ఉండే ఐర‌న్ కంటెంట్ ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ద‌రి చేర‌కుండా అడ్డుక‌ట్ట వేస్తుంది.

అలాగే ఈ ఆప్రికాట్‌ జ్యూస్ ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

దంప‌తుల్లో సంతాన లోపాలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.చ‌ర్మం ఆరోగ్య‌వంతంగా మారుతుంది.

కంటి చూపు సైతం రెట్టింపు అవుతుంది.

బయట రూ.100, 200లకు చెప్పులు, బూట్లు కొంటున్నారా? అవి ఎక్కడి నుంచి వస్తాయంటే?