కర్పూరాన్ని ఇలా ఉపయోగిస్తే ఉండే ప్రయోజనాలు ఇవే..!

పూజలో నైవేద్యానికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది.దీనితో పాటు కర్పూరానికి కూడా అదే స్థానం ఉందని పండితులు చెబుతున్నారు.

దిని వాసనతోనే మనకు ఒక మంచి అనుభూతి కలుగుతుంది.కర్పూరాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

ఏ సమస్యలకు కర్పూరాన్ని వాడవచ్చో చాలామందికి తెలియదు.అలాగే కర్పూరం( Camphor ) ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సినమోమం చంపోరా అనే చెట్టు నుంచి ఈ కర్పూరం వస్తుంది.దీన్నే మనం కర్పూరం చెట్టు అని కూడా అంటాము.

దీని వేర్లు, చెక్క, బెరడు, విత్తనాలు, ఆకులను ప్రాసెస్ చేసి కర్పూరం, పచ్చ కర్పూరం, కర్పూరం నూనె తదితరాలను తీస్తారు.

"""/" / అయితే ఇప్పుడు సహజమైన కర్పూరం కంటే మార్కెట్లో సింథటిక్‌ కర్పూరం ఎక్కువగా ఉంది.

దీని ఆరోగ్య అవసరాల కోసం ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు.సహజమైన కర్పూరం దొరికితే కనుక దానివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కర్పూరం వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఊపిరితిత్తులు, గొంతులో వాపులు, అలర్జీలతో బాధపడే వారికి ఇది చక్కగా పనిచేస్తుంది.

అలాగే ముక్కు పూడుకుపోయి శ్వాస అందకపోవడం, దగ్గు ఎక్కువగా రావడం లాంటి సమస్యలు ఉన్నవారు దీన్ని తరుచూగా వాసన చూడటం వల్ల ఫలితం ఉంటుంది.

నరాలలో ఒత్తిడిని తగ్గించడం ద్వారా నొప్పులు, దురద( Itching )ను ఇది దూరం చేస్తుంది.

శరీరంలో సమస్య ఉన్న ప్రాంతంలో ఈ కర్పూరం నూనెను 10 శాతం తీసుకొని దానికి 90 శాతం కొబ్బరి నూనెను కలుపుకొని రాసుకోవడం వల్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి.

"""/" / అలాగే చర్మానికి చల్లదనం కలిగి హాయిగా ఉంటుంది.కర్పూరం ఉన్న స్ప్రే ని ఆర్థరైటిస్ నొప్పులు( Arthritis ) ఉన్నవారు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే కప్పు నీటిలో కర్పూరం వేసి పడుకునే గదిలో పెట్టుకోవడం వల్ల దోమలు రావు.

అలాగే దీనికున్న ఘటన వాసన వల్ల పురుగులు కూడా రావు.వర్షాకాలంలో చేతులు, కాళ్ల గోళ్ళకు ఇన్ఫెక్షన్లు, గోరుచుట్టు లాంటివి వస్తుంటాయి.

అలాంటి వారు నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి వీటికి రాసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.

తారకరత్న కుటుంబానికి ఎన్టీఆర్ చేసిన సాయం తెలుసా.. మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!