బ్రసెల్స్‌ స్ప్రౌట్స్ డైట్‌లో ఉంటే ఆ జ‌బ్బులు ద‌రి చేర‌వు..తెలుసా?

చూపురుల‌కు చిన్న చిన్న క్యాబేజీల్లా క‌నిపించే బ్రసెల్స్‌ స్ప్రౌట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఈ బ్రసెల్స్‌ స్ప్రౌట్స్ లో విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ కె, కాల్షియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌క విలువ‌లు నిండి ఉంటాయి.

అందుకే ఇవి ఆరోగ్య ప‌రంగా అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.ముఖ్యంగా వారానికి రెండు, మూడు సార్లు బ్రసెల్స్ స్ప్రౌట్స్‌ను తీసుకుంటే గ‌నుక వివిధ ర‌కాల జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

మ‌రి ఆలస్యం ఎందుకు బ్రసెల్స్‌ స్ప్రౌట్స్ డైట్‌లో చేర్చుకుంటే ఏయే ఆరోగ్య లాభాలు పొందొచ్చు చూసేయండి.

"""/" / బ్రసెల్స్‌ స్ప్రౌట్స్ లో యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ల కంటే ఐర‌న్ కంటెంటే చాలా ఎక్కువ‌.

అందువ‌ల్ల వీటిని త‌ర‌చూ తీసుకుంటే శ‌రీరానికి ఐర‌న్ పుష్క‌లంగా అంది ఎర్ర ర‌క్త క‌ణాలు చ‌క్క‌గా అభివృద్ది చెందుతాయి.

దాంతో ర‌క్త హీన స‌మ‌స్య దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.ఒక‌వేళ ర‌క్త హీన‌త ఉన్నా త‌గ్గు ముఖం ప‌డుతుంది.

అలాగే బ్రసెల్స్ స్ప్రౌట్స్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

దాంతో గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

బ్రసెల్స్ స్ప్రౌట్స్ లో కెరోటినాయిడ్లు చాలా అధికంగా ఉంటాయి.అందువ‌ల్ల వీటిని తీసుకుంటే కంటి చూపు పెర‌గ‌డ‌మే కాదు.

కంటి సంబంధిత స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే ప‌రార్ అవుతాయి. """/" / క్యాన్సర్ క‌ణాల‌ను నిరోధించటంలో బ్రసెల్స్ స్ప్రౌట్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

వీటిని వారంలో రెండు సార్లు అయినా తీసుకుంటే వివిధ ర‌కాల క్యాన్స‌ర్లు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

అంతే కాదు, బ్రసెల్స్ స్ప్రౌట్స్ ను తిన‌డం వ‌ల్ల మ‌ధుమేహం వ్యాధి అదుపులో ఉంటుంది.

మెద‌డు ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.మ‌రియు ర‌క్త పోటు స్థాయిలు కూడా అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.

దేవుడా, చేప నోట్లో మనిషి పళ్లు.. చూసి పరుగులు తీసిన యువతి!