ఈ సిరి ధాన్యం ధర తక్కువ.. ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ..!
TeluguStop.com
సిరి ధాన్యాలు లేదా మిల్లెట్స్ కు మన ఇండియాలో స్పెషల్ క్రేజ్ ఉంది.
పౌష్టిక విలువలతో నిండి ఉండే సిరి ధాన్యాల్లో చాలా రకాలు ఉన్నాయి.అందులో ఊదలు ఒకటి.
ఈ సిరి ధాన్యం ధర తక్కువే.కానీ అది అధించే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ.
ఊదల్లో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ మెండుగా నిండి ఉంటాయి.
మధుమేహం( Diabetes ) ఉన్న వారికి ఊదలు మంచి ఆహార ఎంపిక అవుతుంది.
ఎందుకంటే, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ( Glycemic Index )కలిగి ఉండటం వల్ల ఊదలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి, డయాబెటిక్ వ్యక్తులకు ఊదలు అనుకూలం.
అలాగే ఊదలు( Barnyard Millet ) తక్కువ కాలరీలతో ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
బరువు తగ్గాలని భావిస్తున్నవారు ఊదలను డైట్ లో చేర్చుకోవచ్చు.ఊదలు పొట్ట నిండిన భావన కలిగిస్తాయి.
అతిగా తినడాన్ని తగ్గిస్తాయి. """/" /
ఊదల్లోని ఖనిజాలు మలినాలను తొలగించడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయి.
శరీరాన్ని శుభ్రం చేస్తాయి.ఇటీవల రోజుల్లో చాలా మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారు.
అయితే ఊదలు హార్మోన్ బ్యాలెన్స్ కు మద్దతు ఇస్తాయి.పిసిఓఎస్ మరియు మెనోపాజ్ సమస్యలను ( Menopause Problems )ఎదుర్కొనే వారికి ఊదలు చాలా అనుకూలంగా ఉంటాయి.
"""/" /
ఊదల్లో విటమిన్ బి మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండటం శరీర రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.
గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారికి ఊదలు అద్భుతమైన ఆహారం.ఎందుకంటే, ఊదలు గ్లూటెన్-రహిత ధాన్యం( Gluten-free Grain ).
ఊదలలో పుష్కలంగా ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మెగ్నీషియం ఎముకలను బలపరచడానికి మరియు ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.
అంతేకాకుండా ఊదలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఇక ఊదలతో అన్నం, ఉప్మా, దోశ, పాయసం లాంటి వంటకాలను తయారు చేసుకుని తీసుకోవచ్చు.
రోజువారీ ఆహారంలో ఊదలను చేర్చడం వల్ల శారీరక ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది.
నాని రెండు సినిమాలతో హిట్ కొడతాడా..?