బూడిద గుమ్మ‌డిని నిర్ల‌క్ష్యం చేస్తే ఈ లాభాల‌న్నీ మిస్ అయిన‌ట్లే!

బూడిద గుమ్మ‌డి.దీని గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

దీనిని ఆష్ గౌర్డ్ అని పిలుస్తుంటారు.దిష్టి తగలకుండా ఉండాల‌ని దాదాపు అంద‌రి ఇంటి గుమ్మాల‌కు బూడిద గుమ్మ‌డి కాయ‌ల‌ను క‌డుతుంటారు.

అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.బూడిద గుమ్మ‌డిలో ఎన్నో విలువైన పోష‌కాలు నిండి ఉంటాయి.

అవి మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అయినా స‌రే బూడిద గుమ్మ‌డిని నిర్ల‌క్ష్యం చేస్తుంటారు.

త‌ద్వారా అనేక ఆరోగ్య లాభాల‌ను మిస్ అవుతారు.మ‌రి ఆ లాభాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

కిడ్నీ స్టోన్స్ స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అయ్యేవారికి బూడిద గుమ్మ‌డి కాయ ఓ వ‌ర‌మ‌నే చెప్పొచ్చు.

త‌ర‌చూ బూడిద గుమ్మ‌డిని తీసుకుంటే.అందులోని ప‌లు పోష‌కాలు మూత్ర‌పిండాల్లోని రాళ్ల‌ను క‌రిగిస్తాయి.

అదే స‌మ‌యంలో వివిధ ర‌కాల యూరినరీ స‌మ‌స్య‌లు సైతం దూరం చేస్తాయి.బూడిద గుమ్మ‌డిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

అందువ‌ల్ల, బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నించే వారికి బూడిద గుమ్మ‌డి బెస్ట్ కూర‌గాయ‌.వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు బూడిద గుమ్మ‌డి కాయ‌తో జ్యూస్ త‌యారు చేసుకుని తీసుకుంటే వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

"""/"/ అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డేవారు బూడిద గుమ్మ‌డిని డైట్‌లో చేసుకోవ‌డం ఎంతో ఉత్తమం.

బూడిద గుమ్మ‌డి అధిక ర‌క్త‌పోటు స్థాయిల‌ను అదుపులోకి తేవ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. """/"/ అంతేకాదండోయ్‌.

బూడిద గుమ్మ‌డి కాయను ఆహారంలో భాగం చేసుకుంటే మ‌ల‌బ‌ద్ధ‌కం, పైల్స్ వంటి స‌మ‌స్య‌ల నుండి విముక్తి ల‌భిస్తుంది.

ర‌క్త హీన‌త ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.కాలేయం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా త‌యార‌వుతుంది.సంతాన స‌మ‌స్య‌లు ఏమైనా ఉన్నా.

వాటి నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి కాబ‌ట్టి.

త‌ప్ప‌కుండా బూడిద గుమ్మ‌డికాయ‌ను డైట్ లో చేర్చుకోండి.

నేటి ఎన్నికల ప్రచారం : కడప లో షర్మిల .. జగన్ ఎక్కడంటే ?