వామ్మో.. ఇంగువతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?

ఇంగువ.వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, సువాసన అందించే ఓ సుగంధ ద్రవ్యం.

పురాత‌న కాలం నుంచే భార‌త‌దేశంలో ఇంగువను ఉప‌యోగిస్తున్నారు.అయితే ఘాటైన వాసన కలిగిన ఇంగువను చాలా మంది తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు.

కానీ, అదే మీరు చేసే పొర‌పాటు.ఎందుకంటే ఇంగువ‌తో ఎన్నో అద్భుత ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు.

ప్ర‌తిరోజు డైట్‌లో ఇంగువ చేర్చుకోవ‌డం వ‌ల్ల‌ గ్యాస్‌ సమస్యలు రాకుండా ఉండ‌టంతో పాటు జీర్ణవ్య‌వ‌స్థ కూడా మెరుగుప‌డుతుంది.

అలాగే మ‌ధుమేహంతో బాధ‌ప‌డేవారికి ఇంగువ ఒక ఔష‌దంలా ప‌నిచేస్తుంది.ఎందుకంటే, రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించే శ‌క్తి ఇంగువ‌కు ఉంది.

ఇంగువ‌లోని యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాలు దగ్గు, ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.

"""/" / అందుకే ప్ర‌తిరోజు ఒక గ్లాసు వేడినీటిలో చిటికెడు ఇంగువ వేసుకుని తీసుకోవాల‌ని నిపుణులు అంటున్నారు.

లైంగిక స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డేవారు ఇంగువ‌ను తీసుకుంటే.మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక ర‌క్త‌పోటును అదుపు చేయ‌డంలోనూ, మ‌హిళ‌ల్లో నెల‌స‌రి నొప్పులు త‌గ్గించ‌డంలోనూ, త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డంలోనూ ఇంగువ ఉప‌యోగ‌ప‌డుతుంది.

అందుకే ఇంగువ‌ను ఏదో ఒక‌రూపంలో ప్ర‌తిరోజు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ చరణ్ పాత్రకు స్పూర్తి ఆ కలెక్టర్ అని తెలుసా.. ఆ వ్యక్తి ఎవరంటే?