ఆరోగ్యానికి అమృతం సోయా పాలు.. దాని లాభాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు!
TeluguStop.com
ఈ మధ్యకాలంలో చాలా మంది ప్లాంట్ బేస్డ్ మిల్క్( Plant Based Milk ) కు అలవాటు పడుతున్నారు.
మొక్కలు ఆధారిత పానీయాల్లో సోయా పాలు అత్యంత ప్రసిద్ధి చెందాయి.సోయా బీన్స్ ద్వారా సోయా మిల్క్ తయారవుతుంది.
శాకాహారి లేదా లాక్టోస్ అసహనం ఉన్న వ్యక్తులు జంతు పాలకు ప్రత్యామ్నాయంగా సోయా పాలను ఉపయోగిస్తుంటారు.
ఇకపోతే ఆరోగ్యానికి సోయా పాలు అమృతం అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఎందుకంటే మన శరీరానికి అవసరమయ్యే వివిధ పోషకాలను మనం సోయా పాల ద్వారా పొందవచ్చు.
అసలు సోయా పాలు అందించే ఆరోగ్య లాభాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.సోయా మిల్క్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు( Omega-3 Fatty Acids ) పుష్కలంగా ఉంటాయి.
ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.చిత్తవైకల్యం మరియు అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
సోయా పాలల్లో ఉండే కాల్షియం ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది.సోయా మిల్క్ ద్వారా విటమిన్ బి2, విటమిన్ బి12, విటమిన్ డి ( Vitamin B2, Vitamin B12, Vitamin D )వంటి ముఖ్యమైన పోషకాలని పొందవచ్చు.
సోయా ఆహారాలు రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాల్లో తేలింది.
"""/" /
అలాగే వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారికి సోయా పాలు( Soy Milk ) మంచి ఎంపిక అవుతుంది.
బరువు నిర్వహణకు సోయా పాలు అద్భుతంగా సహాయపడతాయి.ఇటీవల రోజుల్లో నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.
అయితే నిద్ర వేలకు ముందు ఒక కప్పు గోరువెచ్చని సోయా పాలు తాగితే చాలా వేగంగా నిద్రలోకి జారుకుంటారు.
నిద్ర నాణ్యత కూడా మెరుగు పడుతుంది.అంతేకాదు సోయా పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
అధిక రక్తపోటు సమస్య తగ్గుముఖం పడుతుంది.మరియు గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.
"""/" /
అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరు మాత్రం సోయా పాలు తీసుకోరాదు.
ముఖ్యంగా సోయా అలర్జీ ఉన్నవారు సోయా పాలను అవాయిడ్ చేయాలి.అలాగే సోయా ఉత్పత్తులలో ఆక్సలేట్‌లు ఉంటాయి, ఇవి కిడ్నీ స్టోన్స్‌లో ప్రధాన పదార్ధం.
కాబట్టి ఇప్పటికే కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతుంటే సోయా మిల్క్ కు దూరంగా ఉండటమే మంచిది.
యాంటీబయాటిక్స్ తీసుకునే వ్యక్తులు సోయా మిల్క్‌ను ఎక్కువగా తాగకూడదు.థైరాయిడ్ వ్యాధి చరిత్ర కలిగిన వ్యక్తులు వారి ఆహారంలో సోయా పాలను చేర్చే ముందు డాక్టర్ ను సంప్రదించడం అవసరం.
బిల్లా మూవీ చూసి అమ్మ చెప్పిన మాటకు షాకయ్యాను.. అనుష్క సంచలన వ్యాఖ్యలు వైరల్!