పుల్లటి పెరుగుతో ఎంత అందమో తెలుసా?

పెరుగు ఆరోగ్యానికి మంచిది.ప్రతి రోజు పెరుగు లేనిదే మన భోజనం ముగియదు.

పెరుగు లో ఎక్కువగా విటమిన్లు ఫాటీ యాసిడ్లు ఉంటాయి.పెరుగు ఆరోగ్యానికే కాకుండా, మన అందం రెట్టింపు అవ్వడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది.

పుల్లటి పెరుగు తో ఇలా చేయడం ద్వారా మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

మరి అది ఎలాగో ఇక్కడ చదివి తెలుసుకుందాం.మన ఇంట్లో మిగిలిపోయిన పెరుగు పుల్ల గా మారడం వల్ల తినడానికి ఇష్టపడరు.

మరి అలాంటి పెరుగు, కొద్దిగా బియ్యం పిండి తీసుకొని రెండింటిని బాగా మిశ్రమంలా తయారుచేయాలి.

ఈ మిశ్రమాన్ని ఫేస్ మొత్తం ప్యాక్ లా వేసుకుని బాగా స్క్రబ్ చేయాలి.

పది నిమిషాలు తర్వాత చల్లని నీటితో ముఖం కడగాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మొహం మీద ఉండే టాన్, మొటిమలు , మచ్చలు తగ్గుతాయి.

పుల్లటి పెరుగులో కొద్దిగా అలోవెరా జెల్ ను కలిపి బాగా మిశ్రమంలా తయారు చేసుకొని మొహం మొత్తం మిశ్రమాన్ని రాసుకోవాలి.

పది నిమిషాలు ఆగిన తర్వాత ఐస్ క్యూబ్స్ తో మొహాన్ని మర్దనా చేసి, వాటితోనే ఫేస్ మొత్తం కడగాలి.

దీని ద్వారా చర్మం ముడతలు పడకుండా మన చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయి, అలాగే మీ చర్మం మృదువుగా తయారవుతుంది.

పెరుగు, శనగపిండి మిశ్రమాన్ని ముఖం మెడ, కాళ్లకు, చేతులకు రాసుకుని 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి ఇలా వారంలో రెండు సార్లు చేయడం ద్వారా చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా తయారవుతుంది.

గుడ్డులోని తెల్లసొన, ఓట్స్ పొడి, పెరుగు మిశ్రమాన్ని బాగా కలిపి మొహానికి పూయడం వల్ల మన చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి.

అలాగే పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలిపి పట్టించుకోవడం వల్ల చాలా తొందరగా మీ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

చూశారు కదా మరెందుకు ఆలస్యం పెరుగుతో మరి ఇలాంటి చిట్కాలను ట్రై చేసి అందమైన చర్మం మీ సొంతం చేసుకోండి.

కోతి-కింగ్ కోబ్రా స్నేహం.. ఏకంగా మెడలో వేసుకొని.. వీడియో వైరల్