వారానికి 2 సార్లు ఇలా ఆవిరి పట్టారంటే మొటిమలు మచ్చలు లేని మెరిసే చర్మం మీ సొంతమవుతుంది!
TeluguStop.com
ముఖ చర్మం ఎటువంటి మొటిమలు మచ్చలు లేకుండా అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి.
అటువంటి చర్మాన్ని పొందడం కోసం చాలా ఖరీదైన చర్మ ఉత్పత్తులను వాడేవారు మనలో ఎంతో మంది ఉన్నారు.
అలాగే వారానికి ఒకటి రెండుసార్లు తమకు తెలిసిన బ్యూటీ టిప్స్ కూడా పాటిస్తూ ఉంటాను.
అయితే అందాన్ని పెంచడంలో ఫేస్ స్టీమింగ్ కూడా ఎంతో బాగా సహాయపడుతుంది.ముఖానికి ఆవిరి పట్టడాన్నే ఫేస్ స్టీమింగ్ అని అంటాము.
ఇది అత్యంత సులువైన పద్ధతి.కానీ దాని ప్రయోజనాలు మాత్రం అంతులేని విధంగా ఉంటాయి.
అందుకోసం ముందుగా ముఖంపై ఏమైనా మేకప్ లేదా క్రీమ్స్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఆ తర్వాత బాగా మరిగించిన నీటితో ముఖానికి ఆవిరి పట్టించాలి.ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఆవిరి పట్టించిన అనంతరం ఎటువంటి క్రీమ్స్ రాయకుండా చర్మాన్ని కాసేపు అలా వదిలేయాలి.
వారానికి రెండు సార్లు ఫేస్ స్టీమింగ్ చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు.
"""/" /
ఆవిరి పట్టడం వల్ల చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.చర్మం లోపలి పొరల్లో ఉన్న దుమ్ము, ధూళి మరియు ఇతర మలినాలు ఆవిరి పట్టడం ద్వారా తొలగిపోతాయి.
స్టీమింగ్ మీ రక్త నాళాలను విస్తరింపజేస్తుంది మరియు ప్రసరణ పెంచుతుంది.ఫలితంగా మీ చర్మానికి సహజమైన, ఆరోగ్యకరమైన మెరుపు అందుతుంది.
అలాగే ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి.దాంతో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మృదువుగా మారతాయి.
ఫలితంగా వాటిని ఈజీగా తొలగించవచ్చు. """/" /
ఫేస్ స్టీమింగ్ వల్ల మొటిమలు రావడం కంట్రోల్ అవుతాయి.
మచ్చలు తగ్గుముఖం పడతాయి.స్కిన్ ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంటుంది.
అంతేకాదండోయ్.ఫేస్ స్టీమింగ్ కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
దీని వల్ల చర్మం దృఢంగా, యవ్వనంగా కనిపిస్తుంది.కాబట్టి మొటిమలు మచ్చలు లేని మెరిసే అందమైన చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా వారానికి రెండుసార్లు ఫేస్ స్టీమింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి.
ముఖ్యమంత్రికి ముద్దుపెట్టబోయిన మహిళా.. వీడియో వైరల్