భోజ‌నం నెమ్మదిగా తిన‌డం వ‌ల్ల క‌లిగే లాభాలేంటో తెలుసా?

సాధార‌ణంగా కొంద‌రు భోజ‌నాన్ని చాలా హ‌డావుడిగా తింటుంటారు.కనీసం ప‌ది నిమిషాలు కూడా భోజ‌నం చేయ‌డానికి కేటాయించ‌రు.

పని ఒత్తిడి, అర్జెంట్ మీటింగ్స్ త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల భోజనంలో తొందరప‌డుతుంటారు.కాలక్రమేణా వేగంగా తినడం ఒక అలవాటుగా మారిపోతుంది.

మీకు కూడా ఈ ఫాస్ట్ ఈటింగ్ అల‌వాటు ఉందా.? అయితే క‌చ్చితంగా ఆ అల‌వాటును వ‌దులుకోండి.

ఎందుకంటే వేగంగా తినడం మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.అలాగే వేగంగా తినడం అనేది అతిగా తినడం తో ముడిపడి ఉంటుంది, ఇది బరువు పెరగడానికి మరియు చివరికి స్థూలకాయానికి దోహదం చేస్తుంది.

ఫాస్ట్ ఈటింగ్ కు బ‌దులుగా స్లో ఈటింగ్ ను ఎంచుకోవడం ఎంతో ఉత్త‌మ‌మైన మార్గం.

భోజ‌నం( Food ) నెమ్మ‌దిగా తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు పొందుతారు.భోజనం పూర్తి చేయడానికి కనీసం ఇర‌వై నుండి ముప్పై నిమిషాలు కేటాయించాల్సి ఉంటుంది.

భోజ‌నాన్ని నెమ్మదిగా న‌మిలి తిన‌డం వ‌ల్ల త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది.ఇది జీర్ణవ్యవస్థ ప్రక్రియను సులభతరం చేస్తుంది.

ఫ‌లితంగా గ్యాస్, క‌డుపు ఉబ్బరం, అజీర్తి ( Gas, Bloating, Indigestion )వంటి జీర్ణ స‌మ‌స్య‌లు ఇబ్బంది పెట్ట‌కుండా ఉంటాయి.

"""/" / భోజ‌నం చేయ‌డానికి ఎక్కువ‌ సమయాన్ని వెచ్చించడం వ‌ల్ల మీరు మీ ఆహారం యొక్క టేస్ట్ మ‌రియు ఫ్లేవ‌ర్స్ ను ఆస్వాదించవచ్చు.

ఇది భోజనాన్ని మరింత ఆహ్లాదకరంగా మరియు సంతృప్తికరంగా చేస్తుంది.అలాగే నెమ్మ‌దిగా త‌నడం వ‌ల్ల త‌క్కువ‌గా తింటారు.

ఆక‌లి కంట్రోల్ లో ఉంటుంది.అతిగా తిన‌డం త‌గ్గిస్తారు.

కాలక్రమేణా ఇది ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. """/" / ఆహారాన్ని బాగా నములుతూ నెమ్మదిగా తినడం ద్వారా.

మీ శరీరం మీరు తినే ఫుడ్ నుండి ఎక్కువ పోషకాలను గ్ర‌హిస్తుంది.ఇది మొత్తం ఆరోగ్యాన్ని ప్ర‌భావితం చేస్తుంది.

నిదానంగా తినడం వల్ల ఆహారంపై దృష్టి పెట్టడంతో పాటు విశ్రాంతి తీసుకోవడంలో సహాయపడుతుంది.

కాబ‌ట్టి ఇక‌పై హ‌డావుడిగా తిన‌డం మానేసి ఆహారాన్ని ఆస్వాదిస్తూ నెమ్మ‌దిగా తిన‌డం అల‌వాటు చేసుకోండి.

కాపీల “విశ్వంభర”.. హీరో గెటప్ టూ వరస్ట్..?