పెరుగులో నల్ల ఉప్పు క‌లిపి తింటే..ఆ జ‌బ్బులు దూరం!

పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.పెరుగు అద్భుత‌మైన రుచి క‌లిగే ఉండ‌ట‌మే కాద‌.

పోష‌కాలు కూడా మెండుగా ఉంటాయి.పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, కాల్షియం, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే అనేక పోష‌క విలువ‌లు పెరుగులో ఉంటాయి.

అందుకే రోజుకో క‌ప్పు పెరుగును డైట్‌లో చేర్చుకోవాల‌ని నిపుణులు చెబుతారు.అయితే పెరుగునే డైరెక్ట‌ర్‌గానే కాకుండా.

అందులో కొన్ని కొన్ని ఇన్‌గ్రీడియ‌న్స్ క‌లిపి తీసుకంటే మ‌స్తు ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా చాలా మందిని గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు కామ‌న్‌గా ఇబ్బంది పెడుతుంటారు.

అయితే అలాంటి స‌మ‌యంలో ఒక క‌ప్పు పెరుగులో చిటికెడు న‌ల్ల ఉప్పు క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేస్తే.చాలా త్వ‌ర‌గా గ్యాస్‌, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్యల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతారు.

జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు ప‌డుతుంది.అలాగే బ‌ల‌హీన‌త‌, అధిక నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డుతుంటారు చాలా మంది.

అయితే అలాంటి వారు పెరుగు‌లో ఓట్స్ మ‌రియు అర‌టి పండు క‌లిపి ప్ర‌తి రోజు తీసుకుంటే.

అందులో ఉండే పోష‌కాలు శ‌రీరానికి త‌గినంత శ‌క్తిని అందిస్తాయి.బ‌ల‌హీన‌త‌, నీర‌సం, అల‌స‌ట స‌మ‌స్యలు దూరం అవుతాయి.

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని బ‌ల‌ప‌రుచుకోవాలి అని భావించే వారు.ఉసిరి కాయ‌ల‌ను ఎండ బెట్టి చేసుకోవాలి.

ఈ పొడిని పెరుగు క‌లిపి తీసుకోవాలి.ఇలా చేస్తే.

ఇమ్యూనిటీ సిస్ట‌మ్ బ‌ల‌ప‌డుతుంది.దాంతో వైర‌స్‌లు, ఇన్ఫెక్షన్లు దరి చేర‌కుండా ఉంటాయి.

ఇక అప్పుడ‌ప్పుడూ నోటి పూత‌, క‌డుపు మంట‌, క‌డుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడుతుంటాయి.

అలాంటి స‌మ‌యంలో పెరుగులో వాము పొడి క‌లిపి తీసుకుంటే.మంచి ఫ‌లితం ఉంటుంది.

విమానంలో సడన్‌గా దర్శనమిచ్చిన పాము.. ధైర్యం చేసిన ఆస్ట్రేలియన్ యాక్టర్..?