క‌ల‌బంతో దాంప‌త్య సుఖం సూప‌ర్‌

కలబంద ఇప్పుడు ఏ సౌందర్య సాధనాలమీద చూసినా కలబంద ఉంటుంది.హెయిర్ జెల్స్ నుంచి స్కిన్ క్రీమ్, వరకు అన్నిటిలో కలబందని ఉపయోగిస్తున్నారు.

అయితే కలబంద సౌందర్య సాధ‌నాలకే కాకుండా ఆరోగ్య పరంగా ఎంతగానో ఉపయోగ పడుతుంది అని వైద్యులు చెప్తున్నారు.

కలబందలో ఎన్నో ప్రయోజనాలు ఉండబట్టే ఒక ఎకరం కలబంద పంటకు లక్ష రూపాయలు ఇస్తాం అని ప్రకటించింది.

కలబంద వల్ల‌ కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.అరకప్పు కలబంద గుజ్జును రోజు తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులు , ఇన్ఫెక్షన్లు దూరం చేసుకోవచ్చు.

కలబంద వేళ్ళని తీసి శుభ్రం చేసుకుని పాలలో ఉడికించాలి.చల్లారిన తరువాత వాటిని తీసి బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి.

ఈ పొడిని రోజుకో స్పూన్ తీసుకుని పాలలో కలిపి త్రాగితే దంపతుల దాంపత్య జీవితం సుఖంగా పండుతుంది.

!--nextpage కలబంద గుజ్జుని ముఖానికి రాసుకుంటే మొటిమలు,మచ్చలు పోతాయి.అంతేకాదు జుట్టు ఒత్తుగా,ధృడంగా పెరగడానికి,కలబంద జెల్ తీసుకుని అందులో ఒక చిటికెడు గరుకు ఉప్పు వేస్తే అది నీరుగా మారుతుంది.

ఆ నీటిని నువ్వుల నునే,కొబ్బరి నునే లో కలిపి మరిగించి చల్లారిన తరువాత ఆ ద్రావణాన్ని రోజు తలకు రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది.

అధిక బరువుతో భాద పడే వాళ్ళు రోజు జెల్ ని తీసుకుంటే బరువు తగ్గుతారు.

శరీరంలో మలినాలు కూడా తొలిగిపోతాయి.చర్మం కాంతి వంతగా,ఆకర్షణీయంగా తయారవుతుంది.

రోజు కబంద జ్యూస్ త్రాగడం వలన కడుపు ఉబ్బరం తగ్గుతుంది.తిన్న ఆహరం త్వరగా జీర్ణం అవడంలో చాలా బాగా ఉపోయోగపడుతుంది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?