కుంకుమ పువ్వుతో ఇలా చేస్తే.. మృదువైన, మెరిసే చ‌ర్మం మీసొంతం!

అందంగా, కాంతివంతంగా క‌నిపించాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు కూడా చేస్తుంటారు.

ముఖ్యంగా అందం విష‌యంలో అమ్మాయిలు అస్స‌లు రాజీ ప‌డ‌రు.వేలకు వేలు ఖ‌ర్చు చేసి మ‌రీ ఫేస్ క్రీములు, లోష‌న్లు కోనుగోలు చేసి.

ఉప‌‌యోగిస్తుంటారు.అయితే చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచ‌డంలో కుంకుమ పువ్వు అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

సాధార‌ణంగా కుంకుమ పువ్వును ప‌లు ర‌కాల వంట‌ల్లో త‌యారు చేస్తుంటారు.అయితే కుంకుమ పువ్వుతో బోలెడ‌న్ని సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.

మృదువైన‌, మెరిసే చ‌ర్మాన్ని అందించ‌డంలో కుంకుమ పువ్వు ఉప‌యోగ‌ప‌డుతుంది.మ‌రి కుంకుమ పువ్వును చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ పువ్వు మ‌రియు పాలు వేసి బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శ‌భ్రం చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖం మృదువుగా మ‌రియు య‌వ్వ‌నంగా మారుతంది.

"""/"/ రెండొవ‌ది.ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, బొప్పాయి గుజ్జు మ‌రియు తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లే చేసి.బాగా ఆరిపోనివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి ఒక‌టి లేదా రెండు సార్లు చేస్తే.

ముఖంపై మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు పోయి తెల్లగా మ‌రియు అందంగా మారుతుంది.మూడొవ‌ది.

ఒక బౌల్‌లో కుంకుమ పువ్వు, చంద‌నం పొడి మ‌రియు పాలు తీసుకుని.బాగా క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లే చేసి.అర‌గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై మ‌లినాలు పోయి.

ప్ర‌కాశ‌వంతంగా మెరుస్తుంది.

ఈ వాటర్ స్లైడ్ ట్యూబ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..?