ఎన్‎డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్‌ సింగ్‌..?

ఎన్ డీ ఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను బరిలోకి దించనున్నట్టు తెలుస్తోంది.

అమరీందర్‌ సింగ్‌ తన పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నట్లు కూడా వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం అమరీందర్‌ సింగ్‌ వెన్నెముక శస్త్రచికిత్స కోసం లండన్‌ వెళ్లారు.గత ఆదివారం ఆపరేషన్‌ పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ.

కెప్టెన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.జూన్ 27న హాస్పిటల్ నుంచి అమరీందర్ డిశ్చార్జ్ అయ్యారు.

లండన్‌ నుంచి తిరిగివచ్చిన తర్వాత కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేయనన్నట్లు భావిస్తున్నారు.

దీనిపై ఇప్పటికే మోదీతో అమరీందర్‌ మంతనాలు జరిపినట్లు సమాచారం.విలీనం అనంతరం కెప్టెన్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశమున్నది.

ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన అమరీందర్‌.గతేడాది ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నారు.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీని ప్రారంభించారు.ఆ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు.

అయితే, ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. """/"/ నాలుగుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు లోక్ సభకు అమరీందర్ ఎన్నికయ్యారు.

రెండుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.ఉప రాష్ట్రపతి ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిందే.

జులై 5 నుంచి జులై 19 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.అవసరమైతే ఆగస్టు 6న ఎన్నిక నిర్వహిస్తారు.

పోలింగ్‌ రోజునే ఫలితాన్ని ప్రకటిస్తారు.ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.

అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను బరిలోకి దించనున్నట్టు తెలుస్తోంది.

తన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ పార్టీని బీజేపీలో విలీనం చేయనన్నట్లు భావిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిది మాట తప్పిన చరిత్ర..: హరీశ్ రావు