బూతులు తిడుతున్నారు అందుకే బయటకు రాలేదు… అమర్ భార్య తేజస్విని కామెంట్స్ వైరల్!
TeluguStop.com
బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి బుల్లితెర నటుడు అమర్ దీప్( Amar Deep ) గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.
బుల్లితెర సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు.
అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో తన ఆట తీరుతో ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు అంతేకాకుండా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో పూర్తిగా నెగెటివిటీని సొంతం చేసుకున్నారు.
ఇలా ఈయన పల్లవి ప్రశాంత్ పట్ల చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా ఎంతో మంది ఈయనపై విమర్శలు కూడా కురిపించారు.
"""/" /
ఇంట్లో కూడా ఎలా ఉండాలో తెలియక, టాస్కుల్లో తడబడుతూ.తనని తాను నిందించుకుంటూ.
అరుస్తూ.ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చాలా గందరగోళంతో గడిపేశాడు.
ఈయన వ్యవహార శైలి చూసిన తర్వాత ఈయన ఎక్కువ కాలం పాటు హౌస్ లో ఉండరని తొందరగానే బయటకు వస్తారు అంటూ కూడా అందరు భావించారు కానీ ఈయన ఇప్పుడిప్పుడే తన ఆట తీరని పూర్తిగా మార్చుకుంటూ తాను ఏంటో నిరూపించుకుంటున్నారు.
అయితే అమర్ గురించి ఎన్నో రకాల నెగటివ్ వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈయన తల్లి స్పందించినప్పటికీ తన భార్య తేజస్విని ( Tejaswini ) మాత్రం ఎక్కడ స్పందించలేదు.
"""/" /
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె అమర్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అమర్ లాస్ట్ ఐదు వారాల నుంచి చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడిప్పుడే కాస్త మెరుగ్గా ఆట ఆడుతున్నారని తెలిపారు.
అమర్ పట్ల నెగిటివ్ కామెంట్స్ వస్తుంటే చాలామంది మీరు ఎందుకు స్టాండ్ తీసుకోవడం లేదని అడిగారు.
పెయిడ్ పీఆర్ బ్యాచ్ వేధించారు.నెగిటివీ, బూతులు తిడుతుంటే.
బయటకు వచ్చి ఎలా మాట్లాడను.పెయిడ్ పీఆర్ వాళ్లు బూతులు తిడుతూ కామెంట్లు చేయిస్తున్నారు.
అందుకే, ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు.కానీ, ధైర్యం తెచ్చుకుని ముందుకు వచ్చానని తెలిపారు.
జెన్యూన్ ఫ్యాన్స్ అమర్ ఆశించిన స్థాయిలో లేరని చెప్పారు.అయితే బిగ్ బాస్ కార్యక్రమాన్ని చూసి ఇతరులను కించపరిచే వారికి తాను ఒకటే చెబుతున్నాను.
బిగ్ బాస్ కార్యక్రమంలో ఒకసారి కొట్టుకుంటారు మరొకసారి కలిసిపోతారు అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ మెంబర్స్ ని తిట్టడం మంచిది కాదని మీ ఇంట్లో కూడా ఇలా మహిళల పట్ల ఎవరైనా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో ఇతరుల బాధ కూడా అలాగే ఉంటుంది అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
భార్యంటే పిచ్చి ప్రేమట.. సొంతంగా వాసెక్టమీ చేసుకున్నాడు… వీడియో చూస్తే షాక్ తింటారు!