పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసిన అమర్ దీప్..ఇది అమర్ గ్రాఫ్ పై ప్రభావం చూపనుందా..?

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) మరియు అమర్ దీప్ మొదటి రెండు స్థానాల్లో ఉంటారు.

మొదటి వారం నుండి వీళ్లిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.సోషల్ మీడియాలో రైతు బిడ్డ మరియు బీటెక్ బాబు పేర్లు ఒక రేంజ్ లో పాపులర్ అవ్వడానికి వీళ్ళిద్దరే కారణం.

అయితే ఈమధ్య కాలం లో వీళ్లిద్దరు స్నేహం గా ఉండడం అందరినీ ఆశ్చర్యపర్చింది.

చూడడానికి వీళ్ళ స్నేహం చాలా ముచ్చటగా కూడా ఉంది.కానీ ఈ వారం మళ్ళీ వీళ్లిద్దరి మధ్య రెండవ వారం లో జరిగిన రేంజ్ లో బీభత్సమైన గొడవలు జరిగినట్టుగా రీసెంట్ గా విడుదలైన ప్రోమోని చూస్తే తెలుస్తుంది.

ముందుగా అమర్ దీప్ యావర్ ని ఎదో కారణం చేత నామినేట్ చేస్తాడు.

"""/" / అప్పుడు మధ్యలో ఎదో ఒక విషయం లో పల్లవి ప్రశాంత్ ని నువ్వు చెప్పురా అని అమర్ దీప్ ( Amar Deep )అంటాడు.

అప్పుడు ప్రశాంత్ 'నన్ను రా అని పిలవకు' అంటాడు, అప్పుడు అమర్ 'నేను పిలుస్తాను రా, నేను నిన్ను తమ్ముడిగా అనుకున్నాను, రా అని పిలుస్తా, పలికితే పలుకు లేకపోతే పో' అని అమర్ గట్టిగా అరుస్తాడు.

ఆ తర్వాత ప్రశాంత్ మోసగాడివి నువ్వు, మోసం చేసావు నన్ను అంటూ అమర్ పై రెచ్చిపోతాడు.

అంతే కాకుండా ప్రశాంత్ ఆడియన్స్ వైపు చూస్తూ, చూసారు కదా ఇది అమర్ అన్న నిజస్వరూపం, మొదటి నుండి నా మీద నెగటివిటీ తోనే ఉన్నాడు అని మాట్లాడగా, అమర్ దానికి సమాధానం చెప్తూ ' నన్ను బయటకి పంపేయండి, కప్పు వాడికే ఇచ్చేయండి' అంటూ ప్రశాంత్ పై సెటైర్లు విసిరాడు.

దీనికి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్ల్స్ జరుగుతున్నాయి. """/" / ఓటింగ్ లో అమర్ మరియు ప్రశాంత్ ఇద్దరూ కూడా టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు.

కానీ పల్లవి ప్రశాంత్ కి రైతు బిడ్డ ట్యాగ్ కారణంగా కామన్ ఆడియన్స్ లో ఒక రేంజ్ సపోర్ట్ ఏర్పడింది.

అంతే కాకుండా గత వారం 'టికెట్ టు ఫినాలే' టాస్కు లో ప్రశాంత్ ఒక్క రేంజ్ లో రెచ్చిపోయి మరీ ఆడుతాడు.

ఈ ఆట కారణంగా ప్రశాంత్ గ్రాఫ్ ఊహించని రేంజ్ కి వెళ్ళింది.కానీ కామన్ ఆడియన్స్ లో పల్లవి ప్రశాంత్ కి ఉన్న సపోర్టు కారణంగా ఆ ప్రభావం అమర్ పై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది చూడాలి.