నా కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టారు… ప్రాణాలు పోతే తెచ్చుకోలేము ఎమోషనల్ అయిన అమర్?
TeluguStop.com
బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి వారిలో సీరియల్ నటుడు అమర్ దీప్ (Amar Deep) ఒకరు.
అమర్ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్నట్టుగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో రన్నర్ గా బయటకు వచ్చారు.
అయితే హౌస్ లో నామినేషన్ టైం లో ఈయన పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) ను టార్గెట్ చేయడంతో ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది కానీ బయట పల్లవి ప్రశాంత్ అభిమానులు మాత్రం అమర్ కుటుంబం పై దారుణమైనటువంటి నెగటివ్ కామెంట్లతో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఇలా తన ఫ్యామిలీ గురించి చెడుగా కామెంట్లు చేయడంతో అమర్ తల్లి సోషల్ మీడియా వేదికగా పల్లవి ప్రశాంత్ అభిమానుల పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక గ్రాండ్ ఫినాలే రోజు అమర్ తన తల్లి భార్య ప్రయాణిస్తున్నటువంటి కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కారులో వీరు ప్రయాణిస్తూ ఉండగా అభిమానులు ఒక్కసారిగా రాళ్ల దాడి చేశారు. """/" /
ఇక ఈ ఘటన పై తాజాగా అమర్ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఒక వీడియోని షేర్ చేశారు.
ఇందులో భాగంగా ఈయన మాట్లాడుతూ బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో దానిని గేమ్ షో వరకు చూడటం బాగుంది కానీ ఇలా ప్రవర్తించడం ఏమాత్రం మంచిది కాదని కారులో నా భార్య నా తల్లి ఇద్దరు కూడా ఉన్నారు.
వాళ్లకు ఏమైనా జరిగితే ఏం చేయాలి రాళ్లు పొరపాటున వారి తలలకు తగిలి వాళ్లకి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు.
"""/" /
నేనొక్కడినే ఉన్నప్పుడు ఏమైనా చేయండి కానీ మన కుటుంబంలోని ఆడవాళ్లు మనతో పాటు ఉన్నప్పుడు దయచేసి ఎవరూ కూడా ఇలా ప్రవర్తించకండి అంటూ ఈయన తెలిపారు.
కప్పు ఇప్పుడు కాకపోతే మరోసారి గెలవచ్చు డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు ప్రాణాలు పోతే తిరిగి తెచ్చుకోలేము కదా.
ఆరోజు కారులో తేజు అమ్మ ఇద్దరూ ఎంతో భయపడిపోయారని దయచేసి ఇంకొకసారి ఎవరి పట్ల కూడా ప్రవర్తించవద్దు అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.