Bigg Boss Amardeep : బిగ్ బాస్ అమర్ దీప్ బ్యాగ్రౌండ్ తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!
TeluguStop.com
తెలుగు ప్రేక్షకులకు ఉన్నటుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్‌దీప్ చౌదరి( Bigg Boss Amardeep Chowdary ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అమర్‌దీప్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సీరియల్ జానకి కలగనలేదు( Janaki Kalaganaledu ).
సీరియలు హీరో క్యారెక్టర్ లో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.అమర్‌దీప్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ దానికి కలవడం లేదు సీరియల్ రామా అంటే చాలు ఇట్టే గుర్తు పట్టిస్తారు.
ఆ సీరియల్ తో బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు అమర్‌దీప్.సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు బాగా చేరువైన అమర్‌దీప్, బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు.
ప్రస్తుతం అమర్‌దీప్ తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
"""/" /
ఎలా అయిన టైటిల్ గెలవాలి అన్న కసి అమర్‌దీప్ లో బాగానే కనిపిస్తోంది.
ఐదు వారాలుగా ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉన్నా ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అవుతూ తన సత్తాను చాటుతున్నాడు.
ప్రతి గేమ్‌లోనూ పట్టువదలకుండా ఆడుతూ ప్రత్యర్థులకు తనదైన స్టైల్‌లో సమాధానం ఇస్తున్నాడు.కానీ బిగ్‌బాస్ లైవ్ చూస్తున్న వారు మాత్రం అమర్‌కు అన్యాయం జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు.
హౌస్‌లో ఆయన చేస్తున్న మంచి పనులను చాలా వరకు ప్రసారం కావడం లేదని చెప్పుకొస్తున్నారు.
కేవలం అమర్ తప్పుల్ని మాత్రమే బయటి ప్రపంచానికి చూపుతున్నారనే విమర్శలు అమర్ ఫ్యాన్స్ చేస్తున్నారు.
తాజాగా పల్లవి ప్రశాంత్ అభిమానులు కొందరు అమర్ తల్లి రూప, అతని భార్య తేజస్వని గౌడల( Tejaswini Gowda ) పట్ల అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారని ఆయన అమ్మగారు కన్నీరు పెట్టిన విషయం తెలిసందే.
బిగ్‌బాస్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ షోగా మాత్రమే చూడండి.కంటెస్టెంట్ల కుటుంబాలకు చెందిన వ్యక్తులను భూతులతో తిట్టడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదని పలువురు తెలుపుతున్నారు.
"""/" /
ఇంతకీ అమర్ బ్యాగ్రౌండ్( Amardeep Family ) ఏంటి అన్న విషయానికి వస్తే.
అమర్ దీప్ 1990 నవంబర్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో జన్మించాడు.
ఆయన తండ్రి అమీర్ బాషా.కూచిపూడి డ్యాన్సర్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కూడా అమర్ తల్లి పేరు రూపా.
ఆమె కూడా కూచిపూడి నృత్యకారిణి.గతంలో ఆమె బీజేపీలో క్రీయాశీలకంగా పనిచేశారు.
అలా అనంతపురం ప్రాంతంలో ప్రముఖంగా గుర్తింపు పొందారు.కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివిన అమర్ మాస్టర్స్ చదివేందుకు లండన్ వెళ్లి 2016లో పూర్తి చేసి తిరిగొచ్చాడు.
"""/" /
తర్వాత కేరళలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేసి సినిమాలపైన మక్కువతో హైదరాబాద్ వచ్చేశాడు.
అలా తన జాబ్‌ను పక్కన పెట్టి లెక్కలేనన్ని షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో నటించాడు.
మొదటిసారి 2017లో ఉయ్యాల జంపాలా అనే సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు అమర్.
ఆ తర్వాత సిరి సిరి మువ్వలు,జానకి కలగనలేదు లాంటి సీరియల్స్( Amardeep Serials ) లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు.
అలాగే కృష్ణార్జున్ యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు వంటి సినిమాల్లో కూడా ఆమర్ మెరిశాడు.
కాగా ఇటీవలె అమర్‌దీప్ సీరియల్ నటి, కన్నడ బ్యూటీ అయిన తేజస్వని గౌడను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.