అధిక బ‌రువు ఉన్న‌వారు తోట‌కూర తింటే ఏం అవుతుందో తెలుసా?

సాధార‌ణంగా చాలా మంది తెలియ‌కుండానే లావైపోతుంటారు.బ‌ట్ట‌లు టైట్ అయ్యే వ‌ర‌కు తాము లైవైపోతున్నామ‌ని గ‌మ‌నించ‌రు.

అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రుగిపోతుంటుంది.శరీరంలో ఓవ‌ర్‌గా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ అధిక బరువు స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

ఇక ఈ అధిక‌ బ‌రువును నిర్ల‌క్ష్యం చేస్తే.గుండె జ‌బ్బులు, ముధుమేహం, ర‌క్త పోటు ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు త‌లుపుత‌డ‌తాయి.

అందుకే వైద్యులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు బ‌రువును నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాల‌ని సూచిస్తుంటారు.దీంతో ఎక్కువ శాతం మంది బ‌రువు త‌గ్గించేందుకు తిన‌డం మానేస్తుంటారు.

కానీ, అది చాలా పొర‌పాటు.నిజానికి కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోవ‌డం ద్వారా కూడా బరువు త‌గ్గొచ్చు.

అలాంటి వాటిల్లో తోట‌కూర ఒక‌టి.అవును, తోట‌కూర తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గొచ్చు.

శ‌రీరంలో అద‌నంగా పేరుకుపోయి ఉన్న కొవ్వును తోట‌కూర క‌రిగిస్తుంది.మ‌రియు శ‌రీనికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాపర్, ఇనుము వంటి ఖ‌నిజాల‌ను మ‌రియు ప్రోటీన్లు అందించి.

ఎక్కువ‌గా స‌మ‌యం పాటు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. """/" / ఇక తోట‌కూర‌లో ఫైబ‌ర్ కూడా పుష్క‌లంగా ఉంటుంది.

ఫైబ‌ర్ ఉండే ఏ ఆహారం తీసుకున్నా బ‌రువు త‌గ్గుతార‌న్న విష‌యం తెలిసిందే.తోట‌కూర‌లో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండ‌దు.

కాబ‌ట్టి, బ‌రువు త‌గ్గాలి అని భావించే వారు ఖ‌చ్చితంగా డైట్‌లో తోట‌కూరను మాత్రం చేర్చుకోండి.

తోట‌కూర బ‌రువును త‌గ్గించడ‌మే కాదు.మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా చేకూర్చుతుంది.

తోట‌కూర తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే విట‌మిన్ సి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.

"""/" / అలాగే తోట‌కూర‌లో ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మ‌రియు విట‌మిన్ డి, కె ఎముక‌ల ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.

వారానికి క‌నీసం రెండు లేదా మూడు సార్లు తోట‌కూర తిన‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

ఇక గుండె జ‌బ్బులు మ‌రియు అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌డంలోనూ తోట‌కూర స‌హాయ‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న వారు మాత్రం కాదు.అంద‌రూ తోట‌కూరు తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.