దీపావళి సినిమాల్లో క కంటే పెద్ద హిట్ ఆ సినిమానే.. అసలేం జరిగిందంటే?

దీపావళి పండుగ( Deepavali ) కానుకగా తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన సినిమాలలో పెద్ద హిట్ ఏదనే ప్రశ్నకు చాలామంది క సినిమా( Ka Movie ) పేరు సమాధానంగా చెబుతున్నారు.

దీపావళి కానుకగా విడుదలైన క, లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.

క సినిమాకు కిరణ్ అబ్బవరం ప్రమోషన్స్ ప్లస్ కాగా లక్కీ భాస్కర్( Lucky Bhaskar ) సినిమాకు నాగవంశీ ప్రమోషన్స్ ప్లస్ అయ్యాయి.

అయితే పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే అమరన్( Amaran ) మాత్రం తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాలలో క, లక్కీ భాస్కర్ కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధిస్తోంది.

అటు శివ కార్తికేయన్,( Shiva Karthikeyan ) ఇటు సాయిపల్లవికి ( Sai Pallavi ) తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అమరన్ సినిమా సీడెడ్ హక్కులు 90 లక్షల రూపాయలకు అమ్ముడవగా ఇప్పటికే కోటీ 30 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.

"""/" / అంటే కేవలం ఆరు రోజుల్లో ఈ సినిమాకు సీడెడ్ లో 40 లక్షల రూపాయల లాభం వచ్చింది.

సెకండ్ వీకెండ్ ను సైతం అమరన్ పూర్తిస్థాయిలో డామినేట్ చేసే ఛాన్స్ ఉంది.

క, లక్కీ భాస్కర్ లకు కూడా అడ్వాంటేజ్ ఉన్నా లో రేంజ్ ప్రమోషన్స్ తో ఈ స్థాయిలో సత్తా చాటడం సులువైన విషయం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దీపావళి సినిమాల సక్సెస్ తో తెలుగు రాష్ట్రాల థియేటర్లు కళకళలాడుతున్నాయి. """/" / దీపావళి పండుగ కానుకగా విడుదలైన బఘీరా శాండిల్ వుడ్ లో హిట్టైనా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సక్సెస్ సాధించలేదనే చెప్పాలి.

ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి బాగానే కలిసొచ్చిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిన్న సినిమాలు పెద్ద విజయాలను సాధిస్తే ఇండస్ట్రీ కళకళలాడుతుందని చెప్పవచ్చు.

పెద్ద నిర్మాతలు సైతం లో బడ్జెట్ సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.

ప‌చ్చి అల్లం తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..?