శివ కార్తికేయన్ అమరన్ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి స్ట్రీమింగ్ కానుందా?
TeluguStop.com
తమిళ హీరో శివ కార్తికేయన్,( Siva Karthikeyan ) సాయి పల్లవి( Sai Pallavi ) జంటగా నటించిన తాజా చిత్రం అమరన్.
( Amaran ) ఇటీవల విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు కలెక్షన్ల సునామీని సృష్టించింది.
ఇకపోతే ఇప్పటికే థియేటర్లో ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే.
"""/" /
దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి( OTT ) విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఎట్టకేలకు అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి.అభిమానుల ఎదురుచూపులకు పులిస్టాప్ పెడుతూ ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్( Netflix ) అధికారికంగా ప్రకటించింది.
డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది.తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది.
"""/" /
2014లో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ అసువులు బాసిన వీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో రూపొందిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా మంచి సక్సెస్ అయినందుకుగాను ప్రస్తుతం మూవీ మేకర్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుండగా తాజాగా ఆర్మీ ఆఫీసర్లు హీరో శివ కార్తికేయన్ సత్కరించిన విషయం కూడా తెలిసిందే.
ముసలోడివయ్యాక ప్రేమ గుర్తొచ్చిందా… రాజమౌళి వివాదంపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!