భార్యకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన స్టార్ హీరో శివ కార్తికేయన్.. ఏం చేశారంటే?
TeluguStop.com
తాజాగా హీరో శివ కార్తికేయన్( Sivakarthikeyan ) సాయి పల్లవి( Sai Pallavi ) నటించిన చిత్రం అమరన్.
( Amaran ) ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.
విడుదలైన మొదటి షో కే హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి క్యూ కట్టారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.అంతేకాకుండా భారీగా వసూళ్లను కూడా రాబట్టింది.
ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ నటించారు.
"""/" /
ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
ముఖ్యంగా హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి నటనపై ప్రశంసలు కురిపించారు.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా హీరో శివ కార్తికేయన్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో ఆర్మీ డ్రెస్ లో తన ఇంటికి వెళ్లి ఒక్కసారిగా తన భార్యకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు శివ కార్తికేయన్.
"""/" /
శివ కార్తికేయన్ భార్య( Sivakarthikeyan Wife ) వంటగదిలో వంటలు చేస్తూ బిజీ బిజీగా ఉండగా చడి చప్పుడు లేకుండా వెనకాలే వెళ్లి మౌనంగా నిలబడి ఉన్నారు.
ఆయన భార్య ఆర్తి( Aarthi ) తనని గమనించకుండా తనిపని తాను చేసుకుంటోంది.
అలా ఒక్కసారిగా వెనక్కి తిరిగింది.తన భర్తను ఆర్మీ డ్రెస్‌లో చూసిన ఆర్తి ఆశ్చర్యానికి గురైంది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఆ వీడియోని చూసిన అభిమానులు సర్ప్రైజ్ సూపర్ గా ఉంది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
రోబోటిక్ స్పై బేబీ మృతికి కోతులు కన్నీళ్లు.. హార్ట్ బ్రేకింగ్ వీడియో వైరల్!