అమర్ మరో 2 వారాలు బిగ్ బాస్ లో ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడా..? షాకింగ్ రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్లు!
TeluguStop.com
ఈ సీజన్ బిగ్ బాస్ షో ( Bigg Boss Show )అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకరు అమర్ దీప్.
తన ఎంటర్టైన్మెంట్ స్కిల్స్ తో, అందరినీ నవ్విస్తూ, అలరిస్తూ నేడు ఇండియా లోనే టాప్ మోస్ట్ టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకునే రేంజ్ కి బిగ్ బాస్ షో ని తీసుకొని రావడం లో అమర్ దీప్ పాత్రనే ఎక్కువగా ఉంటుంది.
బాగా గమనిస్తే ఈ సీజన్ బిగ్ బాస్ కంటెంట్ మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది.
ప్రోమోస్ లో కానీ, కంటెంట్ లో కానీ అమర్ దీప్ లేకుండా ఏది జరగడం లేదు.
ఆయన మీద ఫోకస్ ఆ రేంజ్ లో ఉంది అన్నమాట.ఇదంతా పక్కన పెడితే అమర్ దీప్( Amar Deep ) బిగ్ బాస్ జర్నీ చాలా కష్టతరమైనది.
హౌస్ లో ప్రతీ ఒక్కరు ఎదో ఒక మాస్క్ వేసుకొని, చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చారు కానీ, అమర్ దీప్ మాత్రం ఎలాంటి మాస్కు లేకుండా ఆడాడు.
"""/" /
చుట్టూ కెమెరాలు ఉన్నాయి అనే భయం లేదు, జనాలు ఇది చేస్తే ఏమనుకుంటారో, ఇది చెయ్యకపోతే ఏమి అనుకుంటారో అనే జాగ్రత్త లేదు, తానూ బయట ఎలా ఉండాలి అనుకున్నాడో, అలాగే ఉన్నాడు.
కోపం వస్తే కోపం చూపించాడు, ప్రేమ వస్తే ప్రేమ చూపించాడు, అలాగే ద్వేషం, బాధ, తప్పులు ఇవన్నీ ఆయన అందరికీ కనిపించే విధంగానే చేసాడు.
బిగ్ బాస్ చరిత్ర లో ఇంత రియల్ గా ఉన్న కంటెస్టెంట్ మరొకరు లేరు అని అమర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో గర్వం గా చెప్పుకుంటున్నారు.
అయితే అమర్ దీప్ ని కొంతమంది హౌస్ మేట్స్, ముఖ్యంగా శివాజీ( Shivaji ) చాలా చిన్న చూపు చూస్తూ వచ్చారు.
అమర్ దీప్ ని ఒక పనికిమాలిన వాడిలాగా ట్రీట్ చేస్తూ వచ్చారు.శివాజీ మరియు అతని బ్యాచ్ అమర్ పట్ల చేసిన అన్యాయాలకు అమర్ మెంటల్ స్ట్రెస్ పై చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది.
"""/" /
కొన్ని పరిస్థితులలో ఆయన ఓవర్ గా ఎమోషనల్ అయిపోవడం, ఓవర్ గా కోపం తెచ్చుకోవడం వంటివి కూడా జరిగాయి.
అలా జరగడానికి కారణం తన ఆత్మాభిమానం ని చంపేస్తున్నారు అనే ఆవేదన అట.
మొన్న పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) తో గొడవ జరిగినప్పుడు అమర్ మానసిక స్థితిని చూసి కోపం తెచుకున్నవాళ్ళు ఉన్నారు, అలాగే జాలి పడిన వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ ఎలాంటి పరిస్థితి ఎదురైనా చాలా బ్యాలన్స్ గా ఉండాలి.అప్పుడే విజేత అవుతారు,ఎప్పుడైతే అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ ని మెడికల్ రూమ్ కి నెట్టుకుంటూ తీసుకెళ్లాడో, అప్పుడే ఆయన టైటిల్ గెలుచుకునే ఛాన్స్ కోల్పోయినట్టే.
బిగ్ బాస్ ఈ సీజన్ మరో రెండు వారాలు పొడిగిస్తారని గతం లో ఒక వార్త వచ్చింది.
అది నిజంగా జరిగి ఉంటే మాత్రం అమర్ ఉన్న మానసిక స్థితికి ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని కొంతమంది డాక్టర్లు అంటున్నారు.
ఆ సమయంలో సినిమాలు వదిలేయాలనుకున్నాను.. అప్సరా రాణి కామెంట్స్ వైరల్!