పిల్లలు పుట్టరని కన్నతల్లి హేళనగా మాట్లాడింది.. ఆమని సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ఆమని ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమెకు ఆశించిన రేంజ్ లో ఆఫర్లు అయితే రావడం లేదు.

నా మేనేజర్ ఉమా మహేశ్వర్ అని ఆయనకు నేను వరుసగా సినిమాలు చేయాలని చెప్పానని ఆమని పేర్కొన్నారు.

నాకు సినిమా పిచ్చి ఎక్కువ అని ఆమె తెలిపారు.మేము మా ఇంట్లో తెలుగు సినిమాలను ఎక్కువగా చూసేవాళ్లమని ఆమని పేర్కొన్నారు.

నేను కన్నడ చదివానని ఆమె వెల్లడించారు.చిరంజీవి గారి కోసం నేను మ్యాగజైన్స్ ను కొనుగోలు చేసేదానినని ఆమని చెప్పుకొచ్చారు.

మా బ్రదర్ కు డబ్బులు ఇచ్చి చిరంజీవి ఫోటోలను తెప్పించుకునేదానినని చిరంజీవి అంటే అంత క్రేజ్ అని ఆమె తెలిపారు.

మా ఆయన బంగారం సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని ఆమని తెలిపారు.

ఆ సినిమాలో సౌందర్య చేయడంతో నేను ఫీల్ కాలేదని ఆమె పేర్కొన్నారు. """/"/ వెంకటేశ్ గారికి జోడీగా నాకు ఛాన్స్ దక్కలేదని ఆమని అన్నారు.

మ్యారేజ్ తర్వాత బ్రేక్ తీసుకోవడం వల్ల మంచి మంచి సినిమాలను కోల్పోవడం జరిగిందని ఆమె వెల్లడించడం గమనార్హం.

ఒక బాబు, ఒక పాప అని పిల్లలు ఆలస్యంగా పుట్టారని ఆమని చెప్పుకొచ్చారు.

నా జీవితంలో అన్నీ ఆలస్యంగానే జరిగాయని ఆమె తెలిపారు.నాకు పిల్లలంటే చాలా ఇష్టమని ఆమె కామెంట్లు చేశారు.

"""/"/ మా అమ్మ చాలాసార్లు నీకు పిల్లలు పుట్టరని కామెంట్ చేశారని ఆమని అన్నారు.

నీకు పిల్లలు రాసిపెట్టలేదని అమ్మ కామెంట్ చేయడంతో హర్ట్ అయ్యానని ఆమె తెలిపారు.

ఎవ్వరు ఏం చెప్పినా హర్ట్ అయితే దేవుడితో గొడవ పడ్దేదానినని ఆమని వెల్లడించారు.

ఆమని చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలయ్య అఖండ 2 సినిమాలో విలయ తాండవం చేయబోతున్నాడా..?