భారతీయ యువకుడి టాలెంట్ కి గూగుల్ ఫిదా....రూ.65 కోట్లు రివార్డ్...

భారతీయులలో అసామాన్య ప్రతిభ దాగుందని ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ప్రస్తుతం అగ్ర రాజ్య హోదాలో ఉన్న అమెరికా ఆ స్థాయిలో ఉందంటే అందుకు ప్రధాన కారణం మన భారతీయ నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు చేయడమే, వారి ప్రతిభను అగ్ర రాజ్య అభివృద్ధికి ఉపయోగించడమే.

ఒక్క అగ్ర రాజ్యమే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే భారతీయులు అత్యంత కీలక స్థానాలలో ఉంటూ తమ అత్యుత్తమ ప్రతిభను చాటుతూ ఉంటారు.

అందుకే అన్ని దేశాలు భారతీయ యువతీ యువకులు తమ దేశాలకు వలసలు రండి అంటూ రెడ్ కార్పెట్ పరుస్తుంటాయి.

ఇదిలాఉంటే కొంత మంది భారతీయులు మాత్రం భారత్ లో ఉంటూ ప్రపంచ దేశాలకు తమ సత్తా చాటుతున్నారు.

ఈ కోవకు చెందిన వాడే అమన్ పాండే.ప్రపంచ దిగ్గజ సంస్థలకు చెందిన సాఫ్ట్ వేర్ లలో బగ్స్ కనిపెట్టడం కోసం ఏకంగా ఓ కంపెనీ స్థాపించిన అమన్ అత్యంత తక్కువ వ్యవధిలోనే వరల్డ్ ఫేమస్ అయ్యాడు.

తాజాగా గూగుల్ తమ సంస్థలకు చెందిన సాఫ్ట్ వేర్ లలో లోపాలను గుర్తించండి అంటూ ఓ రివార్డ్ ప్రోగ్రాం ను నిర్వహించింది.

ఈ పోటీలో పాల్గొన్న అమన్ అతి తక్కువ సమయంలోనే గూగుల్ ఆండ్రాయిడ్, ప్లే స్టోర్, క్రోమ్ వంటి వాటిలో బగ్స్ గుర్తించాడు.

అంతేకాదు అదే ఏడాది లో పలు సంస్థలకు చెందిన సాఫ్ట్ వేర్ లలో కూడా లోపాలు గుర్తించాడు.

దాంతో """/"/ అమన్ టాలెంట్ కి ఆశ్చర్య పోయిన గూగుల్ తమ సంస్థల సాఫ్ట్ వేర్ లలో లోపాలు గుర్తించిన కారణంగా రూ.

65 కోట్లు రివార్డ్అందించింది.అమన్ ప్రస్తుతం బగ్స్ మిర్రర్ పేరిన ఓ కంపెనీ సంస్థాపించి ప్రముఖ కంపెనీలలో ఉండే బగ్స్ ను గుర్తిస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.

కేవలం ఏడాది క్రితమే స్థాపించిన అతడి కంపెనీ ఇప్పుడు భారీ టర్నోవర్ తో నడుస్తోంది.

అంతేకాదు ఎంతో మందికి అమన్ ఉపాదిని కూడా కల్పిస్తున్నాడు.

చీక‌ట్లో మొబైల్ వాడ‌టం వ‌ల్ల ఎన్ని న‌ష్టాలో తెలుసా?