బీచ్ ఒడ్డున బేబీ బంప్ తో రచ్చ చేస్తున్న అమలాపాల్.. ఫోటోలు వైరల్!
TeluguStop.com
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అమలాపాల్ ( Amalapaul ) ఒకరు.
ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి హీరోయిన్ గా మెప్పించారు.అయితే 2014వ సంవత్సరంలో ఈమె దర్శకుడు విజయ్ ( Vijay ) అనే డైరెక్టర్ ను పెళ్లి చేసుకొని కొంతకాలానికి తనుకు విడాకులు ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ఒంటరిగా గడుపుతున్నటువంటి ఈమె జగత్ దేశాయ్ ( Jagath Desai ) అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు.
అక్టోబర్ చివరి వారంలో తన ప్రియుడిని పరిచయం చేసినటువంటి అమలాపాల్ నవంబర్ 5వ తేదీ ఎంత ఘనంగా వివాహం చేసుకున్నారు.
"""/" /
ఇక వీరి వివాహం జరిగే రెండు నెలలు కూడా పూర్తికాకుండానే ఈమె మరొక గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు.
తాను తల్లిని కాబోతున్నాను అంటూ ఈమె ఈ శుభవార్తను అభిమానులకు షేర్ చేశారు.
ఇలా ఈమె పెళ్లి జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తల్లి కాబోతున్నాననే విషయాన్ని తెలియజేయడంతో ఈమె పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యిందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఏది ఏమైనా అమలాపాల్ తన జీవితంలో ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. """/" /
ఇలా తాను తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని అభిమానులతో పంచుకున్నటువంటి అమలాపాల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన బేబీ బంప్ (Baby Bump) ఫోటోలను షేర్ చేశారు.
ఎరుపు రంగు డ్రెస్సులో బీచ్ పక్కన బేబీ బంప్ తో ఈమె మైండ్ బ్లోయింగ్ ఫోటోషూట్స్ నిర్వహించారు.
ఇలా తన భర్తతో రొమాన్స్ చేస్తూనే ఈ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక ఈ ఫోటోలు చూసినటువంటి ఈమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ దేశానికి వెన్నెముక.. వైరల్ అవుతున్న మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు!