ఆ ఒక్క కారణంతోనే మణిరత్నం సినిమాని రిజెక్ట్ చేసిన అమలాపాల్?
TeluguStop.com
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు పొందిన అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
లవ్ ఫెయిల్యూర్, నాయక్జెం డాపైకపిరాజు, ఇద్దరమ్మాయిలు వంటి సినిమాలలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న అమలాపాల్ తెలుగు, తమిళ్ కన్నడ భాషలలో ఎన్నో సినిమాలలో నటించింది.
అయితే అమలాపాల్ ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది.సినిమాలలో ఎక్కువగా కనిపించకపోయినా కూడా ఈ అమ్మడు ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తుంది.
తాజాగా అమలాపాల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియన్ సెల్వన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్యరాయ్, కార్తీ, విక్రమ్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలై సినిమా మీద అంచనాలను భారీగా పెంచేసింది.
భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మణిశర్మ అమలాపాల్ కి అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని వదులుకుంది.
ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. """/"/
ఇక ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలాపాల్ ఈ విషయం గురించి స్పందించింది.
ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.మొదట ఈ సినిమాలోని ఒక పాత్ర కోసం ఆడిషన్స్ కి వెళ్ళాను.
కానీ ఆ పాత్రకి నేను సెట్ అవ్వకపోవడం వల్ల ఛాన్స్ దక్కించుకోలేకపోయాను.ఆ తర్వాత కొన్ని రోజులకు మణిరత్నం గారు స్వయంగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు.
కానీ అప్పుడు నా మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఈ సినిమా నేను చేయలేనని మణిరత్నం గారికి చెప్పాను.
ఈ సినిమాని రిజెక్ట్ చేసినందుకు నాకు ఎటువంటి బాధ లేదు" అంటూ వెల్లడించింది.
ఏందిది.. లగ్జరీ బ్యాగులు పక్కన పెట్టేసి.. బాస్మతి బియ్యం సంచులను వాడుతున్న అమెరికన్లు..