Akkineni Akhil Amala: అక్కినేని అఖిల్ బెడ్ రూమ్ లో అటువంటి పోస్టర్స్.. అవి చూసి అమల అరుస్తుందా?
TeluguStop.com
మామూలుగా కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి.ఆ అలవాట్లను తమలోనే ఉంచుకోకుండా బయటికి కూడా చూపిస్తుంటారు.
ఇక కొంతమందికి కొన్నిట్లపై బాగా ఇష్టాలు ఉంటాయి.అంటే హీరో హీరోయిన్ల పై, క్రికెటర్లపై ఇతర వాటిపై ఇష్టం ఉండటం వల్ల వారికి సంబంధించిన ఫోటోలను తమ గదిలో పెట్టుకుంటూ ఉంటారు.
అయితే అక్కినేని అఖిల్ కి( Akkineni Akhil ) కూడా ఒకదానిపై చాలా ఇంట్రెస్ట్ ఉండటంతో దానికి సంబంధించిన పోస్టర్లు తన బెడ్రూంలో పెట్టుకుంటాడట.
అసలు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి తాత, తండ్రి సపోర్ట్ తో అడుగుపెట్టిన అక్కినేని అఖిల్ గురించి చిన్నతనంలోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
సంవత్సరం వయసులో ఉండగానే సిసింద్రీ సినిమాలో నటించి అందరిచే శభాష్ అనిపించుకున్నాడు.ఇక కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత హీరోగా అడుగుపెడితే అస్సలు కలిసి రావటం లేదని చెప్పాలి.
హీరోగా అఖిల్ అనే సినిమాతో పరిచయం అయ్యాడు.కానీ ఈ సినిమా అసలు సక్సెస్ కాలేదు.
ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలు కూడా తనను నిరాశపరిచాయి.
దీంతో అఖిల్ కి హీరోగా కలిసి రాదు అని తెలుగు ప్రేక్షకులు ముద్రవేశారు.
కాస్తో కూస్తో తన అన్న నాగచైతన్య అయిన ఒక స్టార్ హోదాకి చేరుకున్నాడు కానీ.
తను మాత్రం సరైన హిట్టు కూడా అందుకోలేకపోతున్నాడు. """/" /
దర్శక నిర్మాతలు కూడా తనకు అవకాశాలు ఇవ్వటానికి ముందుకు రావట్లేదు.
అయితే రీసెంట్ గా తను ఒక సినిమాకు సైన్ చేసినట్లు తెలిసింది.కానీ ఆ సినిమా గురించి మళ్ళీ ఎటువంటి అప్డేట్లు అయితే రాలేవు.
వ్యక్తిగతంగా కూడా అఖిల్ బాగా హాట్ టాపిక్ గా మారాడు.గతంలో తను ప్రేమించిన అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకోగా పెళ్లికి ముందే బ్రేకప్( Breakup ) చెప్పుకున్నారు.
"""/" /
ఆ అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోగా అఖిల్ మాత్రం ఒంటరిగా ఉంటున్నాడు.
అయితే అప్పుడప్పుడు అఖిల్ కి సంబంధించిన న్యూస్ లు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.
అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఒక న్యూస్ మరింత వైరల్ అవుతుంది.అదేంటంటే అఖిల్ కు చిన్నప్పటి నుంచి కారులంటే చాలా ఇష్టమని.
అవి కనిపిస్తే చాలు వాటిపై పిచ్చి ప్రేమ చూపిస్తాడు అని తెలిసింది. """/" /
ముఖ్యంగా స్పోర్ట్స్ కార్ లతో( Sports Car ) పాటు రకరకాల కార్లను డ్రైవ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడట.
దీంతో వాటి మీద ఉన్న పిచ్చితో రకరకాల కార్లకు సంబంధించిన పోస్టర్ లను మొత్తం స్టిక్ చేసి పెట్టుకుంటాడట.
ఇక అమల( Amala ) కూడా అఖిల్ రూమ్ ని చూసినప్పుడు ఏంటి ఇవి అంటూ అరుస్తుందట.
అయినా కూడా అఖిల్ వినిపించుకోకుండా వచ్చిన కొత్త కార్ల పోస్టర్లన్నీ అతికించుకుంటాడట.ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవ్వడంతో.
కార్ల మీద అంత ఆసక్తి ఉన్న అఖిల్ అనవసరంగా సినిమాల వైపు వచ్చాడు అని.
తనకు స్పోర్ట్స్ కారు నడపటం ఇష్టం కాబట్టి తనకు అటువైపే వెళ్లాలని ఉందేమో అని అనుకుంటున్నారు.
బడా ప్రొడ్యూసర్ కు 1200 ల ఎకరాలు… కాస్ట్లీగిఫ్ట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్?