కొత్త కోడలికి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు… అమల సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ సీనియర్ నటుడు నాగార్జున (Nagarjuna ) భార్యగా అమల (Amala) అందరికీ ఎంతో సుపరిచితమే ఇలా హీరోయిన్ గా కొనసాగుతున్న అమలను ప్రేమించి నాగార్జున పెళ్లి చేసుకున్నారు.

ఇంకా పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్న ఇటీవల కాలంలో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన ఇంటికి రాబోయే కొత్త కోడలి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

ఈ ఇంటర్వ్యూలో అమల మాట్లాడుతూ తెరమీద నేను పోషించిన పాత్రలను పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో నేను పోషించిన ప్రతి పాత్ర నాకు చాలా సంతృప్తిని కలిగించిందని తెలిపారు.

"""/" / ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన కెరియర్ కి సంబంధించిన విషయాలను అలాగే వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఇక ప్రస్తుతం అక్కినేని ఇంట పెళ్లి వేడుకలు జరగబోతున్న విషయం తెలిసిందే.నాగచైతన్య (Nagachaitanya)శోభితల (Sobhita)వివాహం డిసెంబర్ 4వ తేదీ ఎంతో ఘనంగా జరగబోతుంది.

  ఈ క్రమంలోనే అక్కినేని ఇంటికి రాబోయే కోడలి గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

"""/" / కొత్త కోడలికి ఏదైనా సలహా ఇవ్వాలని అనుకుంటున్నారా అంటూ ఈమెకు ప్రశ్న ఎదురైంది ఈ ప్రశ్నకు అమల స్పందిస్తూ.

మా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టబోయే ఆ అమ్మాయి చాలా టాలెంట్, మెచ్యూర్డ్‌ మహిళ ఆ అమ్మాయికి నేను ప్రత్యేకంగా సలహాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు.

కచ్చితంగా ఆమె తన జీవితంలో ఒక మంచి భార్యగా స్థానం సంపాదించుకుంటుంది.ఒక మంచి భార్యగా తన జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను అలాగే మీ పాఠకులందరూ కూడా ఆ కొత్త జంటను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అమల తన ఇంట్లో అడుగు పెట్టబోతున్న శోభిత గురించి ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పుష్ప2 కోసం సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. దిమ్మతిరిగి పోవాల్సిందే!