టబు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన అమల, నాగచైతన్య

టాలీవుడ్ లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న నాగార్జున( Nagarjuna ) మన్మధుడిగా.

గ్రీకువీరుడుగా.కింగ్ గా.

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.నాగార్జున గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.

ఈయన ఎంతో మంది అమ్మాయిలకి మన్మధుడిగా ఉన్నారు.ఇప్పటికి కూడా ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంటుంది.

ఇక ఆరు పదుల వయసు దాటినా కూడా తన కొడుకుల కంటే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

అలాంటి ఈ హీరో కి మొదటి నుండి చాలామంది హీరోయిన్లతో లవ్ ఎఫైర్స్ ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

ఇక ఇప్పటికే అనుష్క,టబు, రమ్య కృష్ణ వంటి హీరోయిన్లతో నాగార్జున కి సీక్రెట్ రిలేషన్ ఉంది అంటూ ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

మరీ ముఖ్యంగా నాగార్జునకి టబు కి మధ్య ఇప్పటికి కూడా సీక్రెట్ రిలేషన్ నడుస్తుంది అంటూ ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి.

అంతేకాదు టబు( Tabu ) ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జుననే కారణం అంటూ కూడా వార్తలు వచ్చాయి.

ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున భార్య అమల టబు మా ఆయనకి మంచి స్నేహితురాలు.

"""/" / అంతేకాదు నాకు మా ఫ్యామిలీ వాళ్లకు కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్.

ఆమె ఇప్పటికీ హైదరాబాద్ కి వచ్చిన మా ఇంట్లోనే ఉంటుంది అని చెప్పింది.

అయితే ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య( Naga Chaitanya ) నాన్నకి టబు కి మధ్య ఉన్న రిలేషన్ నిజమే కానీ అది మీరు అనుకున్నట్టు కాదు.

ఇప్పటికి టబు గారు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా ఇంటికి పిలవడంతోనే వస్తుంది.

అలాగే ప్రతి పండగకి అందరికీ ఫోన్ చేసి విష్ చేస్తుంది. """/" / అలాగే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే ఉంటుంది.

ఆమె మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లా అయిపోయింది అంటూ నాగ చైతన్య టబు నాగార్జున మధ్య ఉన్న రిలేషన్ పై ఓపెన్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం నాగచైతన్య మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవడంతో అసలు వీరిద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్పా లేదా ఇంకా వేరే ఏదైనానా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక టబు ఇప్పటికీ కూడా చాలా సినిమాలు చేస్తూ అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను చాలా బిజీ గా గడుపుతుంది.

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలా వైకుంఠపురం లో సినిమాలో అల్లు అర్జున్ కి మదర్ గా నటించి మెప్పించింది.