Amala : నాగార్జున పాటకు స్టెప్పులు ఇరగదీసిన అమల.. వీడియో వైరల్?

టాలీవుడ్ క్యూట్ కపుల్ అక్కినేని నాగార్జున,( Nagarjuna ) భార్య అమల( Amala ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

టాలీవుడ్ లో ఉన్న బ్యూటిఫుల్ కపుల్స్ లో ఈ జోడి కూడా ఒకరు.

పెళ్లి అయ్యి ఇన్నేళ్లు అవుతున్నా కూడా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

కాగా వీరిద్దరూ పలు సినిమాలలో కలిసి నటించిన విషయం మనందరికీ తెలిసిందే.ఆ తర్వాత పెళ్లి చేసుకొని మూడు ముళ్ళు బంధంతో ఒకటయ్యారు నాగ్, అమల.

పెళ్లి తర్వాత అమల సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.ఆ తర్వాత 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా( Life Is Beautiful Movie )తో రీ ఎంట్రీ ఇచ్చింది.

"""/" / అలాగే గత ఏడాది శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

కేవలం సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ ఎక్కువ సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తోంది అమల.ఇది ఇలా ఉంటే పెళ్లయి ఇన్నేళ్లు అవుతున్నా కూడా అమల ఎప్పుడు స్టేజ్ డాన్స్ వేయడం అన్నది జరగలేదు.

కానీ మొట్టమొదటిసారి అమల స్టేజిపై అది కూడా నాగార్జున పాటకు స్టెప్పులు వేసింది.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కినేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా అన్నపూర్ణ ఫిల్మ్‌ కాలేజీలో జరిగిన ఒక వేడుకకి ముఖ్య అతిథిగా అమల వెళ్లారు.

"""/" / అక్కడ స్టేజ్‌పై అందరూ ఒక్కో పాటకు డ్యాన్స్‌ చేశారు.ఇక అమల కూడా నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్‌ సినిమా( Hello Brother )లోని ప్రియ రాగాలే పాటకు ఆమె కాలు కదిపారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.ఆ వీడియోని అక్కినేని అభిమానులు తెగ వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా అమలా ఒకవైపు అక్కినేని కోడలిగా బాధ్యతలను చేపడుతూనే అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది.

అమల పెట్ లవర్ అన్న విషయం మనందరికి తెలిసిందే.

సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ కాంబో లో సినిమా రాబోతుందా..? బ్యాక్ డ్రాప్ ఏంటంటే..?