అధికారులకు, సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : పోలీస్ శాఖ నందు 35 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ చీటి సంజీవరావు జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంజీవరావును వారి కుటుంబ సభ్యులతో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఏఏస్ఐ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు.

పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు.

పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు.

తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.ఎటువంటి అవసరం ఉన్న పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,ఆర్.ఐ యాదగిరి, ఎస్.

ఐ శ్రీకాంత్, సంజీవరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

తెలుగులో తమిళ్ సినిమాల హవా తగ్గడానికి కారణం ఏంటి..?