Jagannath Temple : మనదేశంలో ఎన్నో రహస్య ఆలయాలు ఉన్నా.. జగన్నాథ దేవాలయం ఎందుకు ప్రత్యేకం..!

ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ దేవాలయం( Jagannath Temple ) భారతదేశంలోని అత్యంత మర్మమైన దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

అయితే ఈ ఆలయం అత్యంత పురాతన ఆలయం.ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర కూడా చాలా ఉన్నాయి.

నేటికీ కూడా జగన్నాథ ఆలయం లోని విగ్రహంలో శ్రీకృష్ణుడి హృదయం కొట్టుకుంటుందని చాలామంది నమ్ముతారు.

ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు కూడా దాగి ఉన్నాయి.వీటి గురించి ప్రజలకు పెద్దగా తెలియకపోయినా ఈ రహస్యాలు పౌరాణిక కథలలో ప్రస్తావించబడ్డాయి.

పురాణ కథల ప్రకారం హిందూమతంలో ( Hinduism )వైష్ణవ సంప్రదాయంలో జగన్నాథ దేవాలయం అతిపెద్ద తీర్థయాత్రగా పరిగణించబడుతుంది.

"""/" / అంతేకాకుండా జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజు దేశ విదేశాల నుండి ఎంతోమంది యాత్రికులు, భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తారు.

ఇక పూరిలోని ఈ ఆలయం కృష్ణ భగ వానుడికి( Lord Krishna ) అంకితం చేయబడింది.

ఇక్కడ స్వామివారిని జగన్నాథుడని కూడా పిలుస్తారు.హిందూ మతంతో సంబంధం ఉన్న నాలుగు ప్రధాన యాత్ర స్థలాల్లో ఒకటైన పూరీలోని ఈ ఆలయంలో జగన్నాథునితో పాటు తన అన్న బలరాముడు, సోదరి సుభద్ర విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయని నమ్ముతారు.అవి నేటి వరకు కూడా రహస్యంగా ఉన్నాయి.

అయితే ఈ గుడి మీదుగా ఏ విమానం కూడా ఎగరదని, పక్షులు కూడా ఎగరాలంటే భయపడతాయి అని చెబుతారు.

"""/" / పురాణాల ప్రకారం విష్ణువు చార్ ధామ్( Vishnu Char Dham ) లో స్థిరపడిన సమయంలో మొదట బద్రీనాథ్ కు చేరుకున్నారు.

అక్కడ స్నానం చేశారు.ఆ తర్వాత గుజరాత్ వెళ్లినప్పుడు అక్కడ బట్టలు మార్చుకున్నారు.

ఆ తర్వాత భగవంతుడు ఒడిశాలోని పూరీకి చేరుకున్నాడు.అయితే పూరీలో ఆహారం తీసుకున్నాడు.

చివరకు విష్ణువు తమిళనాడులోని రామేశ్వరం చేరుకున్నాడు.అక్కడ విష్ణువు విశ్రాంతి తీసుకున్నాడు.

ఇక హిందూమతంలో భూలోక వైకుంఠంగా పిలువబడే పూరీలోని జగన్నాథుడు ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.ఎందుకంటే ఇక్కడ శ్రీ భగవానుడు తన అన్నా, చెల్లెలు బలరాముడు, సుభద్రలతో ప్రతిరోజు ఆచార, నియమనిష్టలతో పూజిస్తారు.

దొంగ ఏడుపులు పెడ బొబ్బలు ఎందుకక్కా ! కేటీఆర్ చురకలు