అన్నయ్య కష్టం చూసి సినిమాలలోకి రాకూడదనుకున్నా: ఆదిశేషగిరిరావు

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు కృష్ణ సినీ ప్రస్థానం ఎలాంటిదో అందరికీ తెలిసిందే.

ఇలా హీరోగా నిర్మాతగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృష్ణ సినీ కెరియర్లో ప్రతి అడుగులోనూ ఆయనకు తోడుగా తన సోదరుడు ఆదిశేషగిరిరావు ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇక పద్మాలయ స్టూడియో నిర్మించిన తర్వాత ప్రొడక్షన్ నిర్మాణ వ్యవహారాలను అలాగే స్టూడియో వ్యవహారాలన్నింటిని కూడా ఆదిశేషగిరిరావు దగ్గర ఉండి చూసుకునేవారు.

కృష్ణ తరువాత గట్టమనేని ఫ్యామిలీకి తలలో నాలుకలా ఉన్నటువంటి ఆదిశేషగిరిరావు కృష్ణ ఇందిరాదేవి మరణించిన సమయంలో కూడా ఆయన కార్యక్రమాలు అన్నింటిని దగ్గరుండి పూర్తి చేశారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆదిశేషగిరి రావు కృష్ణ సిని వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నుంచి అన్నయ్యతో ఎన్నో జ్ఞాపకాలు ఏర్పడ్డాయని చిన్నప్పుడు అన్నయ్య సైకిల్ పై నన్ను తీసుకొని సినిమాకి వెళ్లేవారని తెలిపారు.

అదేవిధంగా మద్రాసులో అన్నయ్యతో పాటు ఉంటూ చదువుకునే వాడినని ఆదిశేషగిరిరావు తెలిపారు.ఇక కృష్ణ అన్నయ్యని తనకు బంగారం అని పేరును కూడా పెట్టారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆదిశేషగిరిరావు వెల్లడించారు.

అన్నయ్యకు 70 సంవత్సరాల వయసు రాగానే కుటుంబ బాధ్యతలు అన్నింటిని నా చేతిలో పెట్టారని పిల్లలు కూడా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకున్న వారికి ఏది కావాలన్నా తనకు చెప్పి తన సలహాలు తన నిర్ణయాలు కూడా తీసుకునేవారని వెల్లడించారు.

ఇక సినిమా ఇండస్ట్రీలో అన్నయ్య పడుతున్న కష్టం చూసి తాను సినిమాలలోకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు.

"""/"/ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సినిమాని చేయాలని అన్నయ్య ఎంతో తపన పడ్డారు.

ఆ సమయంలోనే దేవుడు చేసిన మనుషులు సినిమా చేశారని ఈయన తెలిపారు.ఇక అన్నయ్యకు వదినమ్మ ఇందిరా దేవి అంటే ఎంతో ఇష్టం వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎవరికి తెలియదు.

వదినమ్మ చనిపోయినప్పుడు అన్నయ్య చాలా ఎమోషనల్ అయ్యారు అంటూ ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు కృష్ణ గారిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

లోక్‌సభ ఎన్నికలు 2024: భారత్‌లో జాగ్రత్త .. తమ పౌరులకు కెనడా హెచ్చరికలు