డార్క్ స‌ర్కిర్స్‌ను మ‌టుమాయం చేసే బాదం..ఎలాగంటే?

డార్క్ స‌ర్కిర్స్ (న‌ల్ల‌టి వ‌ల‌యాలు) స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎంద‌రినో ఇబ్బంది పెట్ట స‌మ‌స్య ఇది.

ఆహార‌పు అల‌వాట్లు, శ‌రీర వేడి, అతిగా స్మార్ట్ ఫోన్లు చూడ‌టం, నిద్ర‌ను నిర్ల‌క్ష్యం చేయ‌డం, పని ఒత్తిడి, డిప్రెష‌న్‌, పోష‌కాల లోపం, మ‌ద్యం సేవించ‌డం, స్మోకింగ్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల డార్క్ స‌ర్కిర్స్ ఏర్ప‌డ‌తాయి.

ముఖం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్నా క‌ళ్ల చుట్టు డార్క్ స‌ర్కిర్స్ ఉంటే కాంతిహీనంగానే క‌నిపిస్తారు.

అందుకే వీటిని నివారించుకునేందుకు ర‌క‌ర‌కాల ఆయిల్స్‌, క్రీములు పూసుకుంటూ నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే ఇంట్లో బాదంతో ఈజీగా డార్క్ స‌ర్కిర్స్‌ను మ‌టుమాయం చేసుకోవ‌చ్చు.మ‌రి బాదంను ఎలా వాడాలి అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బాదం ప‌ప్పుల‌ను పొట్టు తీసి మెత్త‌గా పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిలో కొద్దిగా పాలు మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల చుట్టు అప్లై చేసి కాసేపు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో వాష్ చేసుకోవాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే క్ర‌మంగా డార్క్ స‌ర్కిర్స్ దూరం అవుతాయి. """/"/ అలాగే బాదం ప‌ప్పుల‌ను నాన‌బెట్టి తొక్క తీసేసి పేస్ట్ చేసుకోవాలి.

ఆ పేస్ట్‌లో కొద్దిగా రోజ్ వాట‌ర్ మ‌రియు క‌ల‌బంద గుజ్జు వేసి క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని క‌ళ్ల చుట్టు అప్లై చేసి ఇర‌వై నిమిషాలు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఇక బాదం ప‌ప్పుల‌ను తొక్క తీసేసి పొడి చేసుకోవాలి.ఈ పొడిలో అవోకాడో పండు పేస్ట్ మ‌రియు తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు దీనిని కళ్ల చుట్టు పూసి ఆర‌బెట్టుకోవాలి.అనంత‌రం కూల్ వాట‌ర్‌ను క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్ చేస్తే డార్క్ సర్కిల్స్ ఈజీగా మ‌టుమాయం అవుతాయి.

పొలాల్లో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ వింటేజ్ ఫోటోలో ప్రభాస్ లుక్ కు ఫిదా అవ్వాల్సిందే!