శ్రీవిష్ణు పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది.. నెల కూడా అవ్వకముందే ఓటీటీలోకి సినిమాలు!?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏడాదికి రెండు మూడు సినిమాలలో నటిస్తూ ఆ సినిమాలోని విడుదల చేస్తున్న యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో శ్రీ విష్ణు.
వరుసగా సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు శ్రీ విష్ణు.ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు తెలుగులో దాదాపుగా 20 కు పైగా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే శ్రీ విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం అల్లూరి.
ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాలో కయ్యదు లోహర్ హీరోయిన్గా నటించింది.
అలాగే తనికెళ్ళ భరణి మధు సూదన్ రావ్, ప్రమోదిని తదితరులు కీలకపాత్రలో నటించారు.
గత నెల సెప్టెంబర్ 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే.
ఇక తాజాగా అక్టోబర్ 7 నుంచి ఈ సినిమా ఓటీటీ ఆహా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.అయితే హీరో శ్రీ విష్ణు విషయానికి వస్తే ఇటీవల కాలంలో వరుసగా సినిమాలలో నటిస్తూ ఆ సినిమాలోని థియేటర్లలో విడుదల చేస్తున్నప్పటికీ హీరో శ్రీ విష్ణుకు మాత్రం అంతగా కలిసి రావడం లేదు.
హీరో శ్రీ విష్ణు నటించిన సినిమాలు కనీసం వారం రోజులు కూడా థియేటర్లో ఆడకముందే ఓటిటిలోకి విడుదల అవుతున్నాయి.
ఈ విషయం పట్ల హీరో శ్రీ విష్ణు అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
ఏడాదికి రెండు మూడు సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా ఆ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు హీరో శ్రీ విష్ణు.
శ్రీ విష్ణు నటిస్తున్న సినిమాలు అన్నీ కూడా థియేటర్లలోనే విడుదల అవుతున్నప్పటికీ కనీసం నెలరోజులు కూడా గడవకముందే సినిమాలు ఓటిటిలో విడుదల అవుతున్నాయి.
ఈ విషయం పట్ల శ్రీ విష్ణు కూడా కాస్త నిరాశగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే విడుదల అయిన అల్లూరి సినిమా కూడా అప్పుడే ఓటీటీ లోకి విడుదల అయింది.
సెప్టెంబర్ 23వ తేదీన అల్లూరి సినిమా కనీసం రెండు వారాలు కూడా ఆడకముందే అప్పుడే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.
నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి అదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!