కూతురు చేతిలో ఓడిపోయిన అల్లు అర్జున్.. క్యూట్ వీడియో వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.
ఈ సినిమా విడుదల అయ్యి కొన్ని నెలలు పూర్తిగా వస్తున్న కూడా ఇప్పటికే ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు.
ఈ సినిమాలోని పాటలు, డైలాగులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.అయితే అల్లు అర్జున్ కూడా ఈ సినిమా విజయంతో మంచి జోష్ మీద ఉన్నారు.
పుష్ప పార్ట్ వన్ సినిమా ఆ రేంజ్ లో హిట్ అవడంతో అభిమానులు పుష్ప పార్ట్ 2 పై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైనట్లుగా కనిపించడం లేదు.
దీంతో పుష్ప పార్ట్ 2 సినిమా ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లో విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాడు అల్లు అర్జున్.
సినిమాల్లో నటిస్తూ ఏమాత్రం గ్యాప్ దొరికినా కూడా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
కొన్ని కొన్ని సార్లు ఇంట్లోనే తన కూతురు అర్హ, కొడుకు అయాన్ లతో కలిసి ఆడుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.
అయితే తాజాగా బన్నీకి సంబంధించిన అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"""/" /
ఆ వీడియోలో బన్నీ తన కూతురు అర్హతో కలిసి అల్లు అర్జున్ సరదాగా సందడి చేశారు.
అర్హ పొడుపు కథ అడిగితే దానికి అల్లు అర్జున్ సమాధానం చెప్పారు.అనంతరం అర్హ చెప్పిన టంగ్ ట్విస్టర్ ను చెప్పలేక ఓడిపోయారు అల్లు అర్జున్.
ఆ వీడియోలు అర్హ మాట్లాడుతూ.గంగిగోవు పాలు గరిటెడైనా చాలు ఏమిటది అని ప్రశ్నించగా దానికి అల్లు అర్జున్ జున్ను అంటూ నవ్వుతూ తప్పు సమాధానం చెప్పారు.
ఆ తర్వాత అర్హ టంగ్ ట్విస్టర్ ను అడుగుతూ ఏడు నల్ల లారీలు.
ఏడు తెల్ల లారీలు అనే టంగ్ ట్విస్టర్ ను అడగగా అప్పుడు అల్లు అర్జున్ దానిని పలకలేక నవ్వేశాడు.
కాగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఖలిస్తాన్ మద్ధతుదారులకు కెనడా కోర్ట్ షాక్ .. పోలీసులకు కీలక ఆదేశాలు