బన్నీపై ట్రోల్స్… ఆవేదన వ్యక్తం చేసిన స్నేహ రెడ్డి…పోస్ట్ వైరల్!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటు వార్తలలో నిలుస్తూ ఉంటారు.
సినిమాలకు సంబంధించిన ఏ చిన్న విషయం తెలియజేయకపోయినా లేదంటే కుటుంబానికి సంబంధించిన ఎలాంటి విషయాలను బయట పెట్టకపోయినా ఎంతో మంది వారిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు.
ఇలా ఎంతోమంది సెలబ్రిటీలు ఇలాంటి విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.అయితే గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్( Allu Arjun ) సైతం ఇలా వివాదాలలో నిలుస్తూ విమర్శలను ఎదుర్కొంటున్నారు.
"""/" /
అల్లు అర్జున్ ఎప్పుడైతే జనసేనకు కాకుండా వైసీపీకి మద్దతు తెలియజేస్తూ నంద్యాల వెళ్లారు అప్పటినుంచి మెగా అభిమానులకు అల్లు అర్జున్ టార్గెట్గా నిలిచారు.
అప్పటినుంచి ఏదో ఒక విషయంలో అల్లు అర్జున్ తో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు.
ఇలా తమ ఫ్యామిలీ గురించి వచ్చే విమర్శలపై అల్లు స్నేహారెడ్డి( Allu Sneha Reddy ) కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని స్పష్టమవుతుంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియాలో( Social Media ) వచ్చే విమర్శలు గురించి ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
"""/" /
తాజాగా ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా లేని లైఫ్ ఎలా ఉండేదో చెప్తూ ఒక పోస్ట్ ను షేర్ చేసింది.
ప్రతి షాపు సాయంత్రం మూసివేసినట్టే సోషల్ మీడియా కూడా సాయంత్రం 6 గంటలకు మూసివేస్తే ఎంతో బాగుంటుంది కదా.
మనమందరం నిజ జీవితంలో ఒకరినొకరు కలుసుకోవడానికి, మాట్లాడటానికి సమయం ఉండేది.మన కుటుంబాలతో కలిసి ఉండేవాళ్ళం.
చదువుకోవడం, సంగీతం వినేవాళ్లం.కళలు నేర్చుకొనేవాళ్లం అంటూ ఈమె చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఇలా ఉన్న ఫలంగా స్నేహ రెడ్డి ఇలాంటి పోస్ట్ చేయడం ఇంకా గల కారణం ఏంటి అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.
బహుశా అల్లు అర్జున్ గురించి వస్తున్న విమర్శలను చూసి భరించలేక ఈమె ఇలాంటి పోస్ట్ లు పెట్టారని అభిమానులు భావిస్తున్నారు.