Allu Sneha Reddy : హీరోయిన్ గా అల్లు స్నేహారెడ్డి లేడి ఒరియేంటెడ్ చిత్రం.. త్వరలోనే అధికారిక ప్రకటన?

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun )భార్య స్నేహారెడ్డి( Sneha Reddy ) గురించి మనందరికీ తెలిసిందే.

అల్లు వారి కోడలిగా అల్లు అర్జున్ భార్యగా స్నేహారెడ్డి మనందరికీ సుపరిచితమే.భర్త అల్లు అర్జున్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుండగా స్నేహ రెడ్డి ఒకవైపు ఇంటికి బాధ్యతలను చేపడుతూనే అల్లు అర్జున్ కి సంబంధించిన విషయాలు బిజినెస్ వ్యవహారాలు అలాగే పిల్లలకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ ఉంటుంది.

"""/" / ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్తో పోల్చుకుంటే స్నేహ రెడ్డి ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.

అందుకు గల కారణం కూడా లేకపోలేదు.రోజురోజుకీ స్నేహారెడ్డి తన అందాన్ని మరింత పెంచుతూ స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది.

తరచూ తన ఫ్యామిలీకి పిల్లలకు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది.

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్స్( Glamor Photo Shoots ) చేస్తూ తన అందంతో యువతకు చెమటలు పట్టిస్తోంది.

తన గ్లామర్ ఫోటోషూట్స్ తో అభిమానులను ఫిదా చేస్తోంది.చాలామంది స్నేహ రెడ్డి ఫొటోస్ చూసి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వమంటూ సలహాలు ఇస్తున్నారు.

"""/" / ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే అల్లు స్నేహా రెడ్డి ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోందని,త్వరలోనే ఆ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా రానుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు నిజంగానా అంటూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ అదే గనుక నిజమైతే అల్లు అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.ఇటీవల కాలంలో అల్లు స్నేహారెడ్డి తన అందాన్ని మరింత పెంచుకుంటూ పోతుండడంతో హీరోయిన్ల కంటే అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

75 వేల కోసం ప్రాణాలు కోల్పోయిన థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్.. అసలేం జరిగిందో చూస్తే?