హిందీలో బాహుబలిని మించిపోయిన అల్లు సోదరుల సినిమాల రేటింగ్స్

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి వారసులుగా, అలాగే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింది వారసులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్ టాలీవుడ్ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ స్టార్స్ లో ఒకడిగా ఉంటూ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో ఇమేజ్ ని తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇక అల్లు శిరీష్ కూడా హీరోగా రాణిస్తున్నాడు.ఇక అల్లు అర్జున్ తన సినిమాలని హిందీలో డబ్బింగ్ చేసి యుట్యూబ్ లో రిలీజ్ చేయడం ద్వారా నార్త్ ఇండియా ప్రేక్షకులకి ఇప్పటికే చేరువ అయ్యాడు.

యుట్యూబ్ లో అత్యధికంగా వ్యూస్ ఉన్న టాలీవుడ్ డబ్బింగ్ సినిమాలలో అల్లు అర్జున్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు.

సరైనోడు, దువ్వాడ జగన్నాథమ్, సన్నాఫ్ సత్యమూర్తి, నా పేరు సూర్య లాంటి సినిమాలకి యుట్యూబ్లో అత్యధిక వ్యూస్ ఉన్నాయి.

ఇక అల్లు అర్జున్ హిందీ డబ్బింగ్ సినిమాలని అక్కడ శాటిలైట్ చానల్స్ లో కూడా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు.

వాటికి మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తూ ఉంటాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు అన్న అల్లు అర్జున్ తో పాటు అల్లు శిరీష్ సినిమాకి కూడా హిందీ చానల్స్ లో మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.

అతని చివరి సినిమా ఏబీసీడీ హిందీలో డబ్బింగ్ అయ్యి అక్కడ చానల్ లో ప్రసారం అయ్యింది.

బార్క్ రేటింగ్స్ ఆధారంగా హిందీ ప్రేక్షకులు సరైనోడు, ఏబిసిడి సినిమాలపై ఎక్కువ మక్కువ చూపించారని రేటింగ్స్ నిరూపిస్తున్నాయి.

సరైనోడు, ఏబిసిడి సినిమాలకు 4863, 4016 యావరేజ్ మినిట్ ఆడియన్స్ వచ్చింది.బాహుబలి ది కంక్లూజన్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.

అదే వారం బాహుబలి కూడా టీవీలో ప్రసారమైంది.దీనికి 3609 యావరేజ్ మినిట్ ఆడియన్స్ నమోదయింది.

తమ సినిమాపై హిందీ ఆడియన్స్ చూపించిన ప్రేమపై అల్లు శిరీష్ స్పందించారు.తన సినిమాకు నిజంగా ఇంత అద్భుతమైన రేటింగ్స్ వస్తాయని అనుకోలేదని, హిందీ ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమ మాటల్లో చెప్పలేను అంటున్నారు.

సినిమాలో వినోదం కారణంగా వాళ్ళు అంత బాగా కనెక్ట్ అయ్యారు అని చెప్పుకొచ్చారు.

8 గంటలు జాబ్ చేస్తూ సివిల్స్ లో 239వ ర్యాంక్.. పవన్ కుమార్ సక్సెస్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే!