అల్లు శిరీష్ తో బింబిసార డైరక్టర్..!

కళ్యాణ్ రామ్ తో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు డైరక్టర్ వశిష్ట.

కొత్త దర్శకుడే అయినా అతని టేకింగ్ కి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

ఇక బింబిసార హిట్ తో సత్తా చాటిన డైరక్టర్ వశిష్ట తన నెక్స్ట్ సినిమా మెగా హీరోతో చేస్తున్నాడని తెలుస్తుంది.

కొత్త దర్శకుడే అయినా ఒక సినిమా హిట్ కొడితే ఇండస్ట్రీలో వరుస ఛాన్సులు వస్తాయి.

బింబిసార హిట్ తో వశిష్ట పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుంది.ఈ క్రమంలో అతనికి ఛాన్సులు క్యూ కడుతున్నాయి.

ఆల్రెడీ బింబిసార చూసి నందమూరి బాలకృష్ణ అతనితో సినిమాకు సిగ్నల్ ఇచ్చేశాడు.మంచి కథతో వస్తే బాలయ్య సినిమా ఓకే అయినట్టే.

వశిష్ట నెక్స్ట్ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ హీరోగా వస్తుందని తెలుస్తుంది.

బింబిసార కథను గీతా ఆర్ట్స్ లో కూడా చెప్పాడు వశిష్ట అయితే అతను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడో లేదో అన్న డౌట్ తో అతనితో సినిమా చేయలేదు కానీ సినిమా రిజల్ట్ చూశాక డైరక్టర్ మీద నమ్మకం కలిగింది.

అందుకే గీతా ఆర్ట్స్ వెంటనే పిలిచి అవకాశం ఇచ్చిందట.అల్లు శిరీష్ తో వశిష్ట సినిమా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత బింబిసార 2 కూడా తీస్తారని డిస్కషన్ నడుస్తుంది.

Jangaon ACP Damodar Reddy : జనగామ ఏసీపీ దామోదర్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ వేటు