అల్లు శిరీష్ కి డబ్బుల విలువ తెలియడానికి ఆ పరీక్ష పెట్టారట అరవింద్!

అల్లు శిరీష్( Allu Sirish ) గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

జనవరి 16, 1987న చెన్నైలో జన్మించిన శిరీష్ మొదట నిర్మాతగా, ఆ తరువాత నటుడిగా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు.

బడా చిత్రాల నిర్మాత అల్లు అరవింద్ అతని తండ్రి అయినప్పటికీ, ప్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అయినప్పటికీ శిరీష్ వారి అండతో కాకుండా సొంతంగా ఎదగడానికి నిరంతరం పరితపిస్తుంటారు.

'గౌరవం' అనే మూవీతో శిరిష్ తన నటనా జీవితాన్ని ప్రారంభించారు.తెలుగు మరియు తమిళ భాషలలో చిత్రీకరించిన ఈ ద్వి భాషా చిత్రం కమర్షియల్ గా ఆడనప్పటికీ, క్రిటిక్స్ నుండి మాత్రం మంచి మార్కులే కొట్టేసింది.

"""/" / ఆ తరువాత శిరీష్ 2014లో, చేసిన 'కొత్త జంట' చిత్రం( Kottajanta ) ఆయనకి మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

ఈ క్రమంలో ఆయన చేసిన 'శ్రీరస్తు శుభమస్తు' సినిమా( Sri Rastu Subhamastu ) కూడా శిరిష్ కి మంచి పేరు తెచ్చింది.

ఇక అసలు విషయంలోకి వెళితే, గోల్డెన్ స్పూన్ తో పుట్టిన అల్లు శిరీష్ కి 21 ఏళ్ల వయసులో, ఎదుటి వారితో పోల్చుకొని, 'అలాంటి కారు నా దగ్గర ఎందుకు లేదు!' అని తండ్రి అల్లు అరవింద్ దగ్గర మదనపడినపుడు, 'ముందు సంపాదించడం నేర్చుకో! అప్పుడే కారు కొనే స్తోమత నీకు వస్తుంది!' అని సూచన చేసి కొంత డబ్బు ఇచ్చాడట అరవింద్.

ఆ డబ్బుతో శిరీష్ ఒక వ్యాపారం స్టార్ట్ చేసి, సరిగ్గా మూడేళ్ళ తరువాత ఓ చిన్న కారు కొనుక్కున్నాడట.

అలా మొదటి కారుని కొన్నపుడు, 'ఓ కారు సంపాదించడానికి ఇన్నేళ్లు పడుతుందా?' అని ఫీల్ అయ్యాడట శిరీష్.

"""/" / ఇదే విషయాన్ని తాజాగా శిరీష్ ఓ మీడియా వేదికగా మాట్లాడగా.

ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఇక అల్లు శిరీష్ ప్రస్తుతం సినిమాలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే.

రెండేళ్ల క్రితం 'ఊర్వశివో రాక్షసీవో' సినిమాతో( Urvashivo Rakshasivo ) ప్రేక్షకుల ముందుకు వచ్చి రొమాంటిక్ కామెడీతో పర్వాలేదు అనిపించదు శిరీష్.

ఆ తర్వాత బడ్డీ అనే ఓ సినిమాని అనౌన్స్ చేసి చాన్నాళ్ల తరువాత ఆ సినిమాని రిలీజ్ చేయగా పెద్దగా ఆడలేదు.

దాంతో శిరీష్ నెక్స్ట్ చేయబోతున్న సినిమాల విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తోన్నట్టు భోగట్టా.

బయట సినిమాల్లోనే నాగార్జునకి మంచి స్కోప్ ఉంటుందా? తెలుగు సినిమాల్లో ఉండదా?