అల్లు వారి ప్రేమ కాదంట.. ఊర్వశివో రాక్షసివో

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చాలా మంది ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోతున్నారు.

అందులో అల్లు శిరీష్ కూడా ఒకరు.అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇలా తనకు చాలా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా అల్లు శిరీష్ ఇప్పటి వరకు ఒక్కటే అంటే ఒక్కటి కూడా కమర్షియల్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని దక్కించుకోలేక పోయాడు.

హిట్స్ ఎలాగూ పడడం లేదని సినిమాల సంఖ్య చాలా చాలా తగ్గించాడు.ఈయన గత చిత్రం ఎప్పుడు వచ్చిందో కూడా సరిగ్గా గుర్తు లేనంత టైం అయింది.

ఇక ఈయన హీరోగా అను ఎమన్యూల్‌ హీరోయిన్ గా రూపొందిన సినిమాకు ప్రేమ కాదంట అనే టైటిల్ ని మొదట అనుకున్నారు.

ఆ టైటిల్ కి మంచి స్పందన వచ్చింది.మళ్లీ ఏమనుకున్నారో కానీ టైటిల్ మారుస్తున్నట్లుగా ఇటీవల ప్రకటించి విడుదల తేదీని నవంబర్ 4 అంటూ అధికారికంగా ప్రకటించడం జరిగింది.

"""/"/ టైటిల్ ప్రకటించకుండానే విడుదల తేదీ ప్రకటించారంటూ చర్చ జరుగుతున్న సమయంలోనే చిత్ర యూనిట్ సభ్యులు ఈ సినిమాకు 'ఊర్వశివో రాక్షసివో' అనే టైటిల్ ని ఖరారు చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించి, ఈ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

అల్లు శిరీష్ మరియు అను ఎమాన్యుల్ జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ఆడియన్స్ నీ కూడా తప్పకుండా ఆకట్టుకుంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.అల్లు వారి ఫ్యామిలీ సినిమా అవడంతో భారీగానే ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

కానీ ఈ సినిమా కు పోటీగా సమంత, గుణశేఖర్ కాంబినేషన్ లో రూపొందిన శాకుంతలం సినిమా విడుదల కాబోతుంది.

కనుక కాస్త పోటీ తప్పదు అన్నట్లుగా చర్చ జరుగుతుంది.ఈ సినిమా హిట్ అయితే పర్వాలేదు, ఫ్లాప్ అయితే మాత్రం దారుణమైన వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వావ్, వాట్ ఏ జీనియస్ జాకెట్.. జపనీయులు మామూలోళ్లు కాదు..