టికెట్ల రేట్లు పెంపుపై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు శిరీష్… కౌంటర్ మామూలుగా లేదు?

అల్లు శిరీష్ ( Allu Shirish ) త్వరలోనే బడ్డీ ( Buddy ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా ఆగస్టు రెండవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న అల్లు శిరీష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన టికెట్ల రేట్లు పెంచిన విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ల రేట్లు ( Ticket Price ) పెంచడమే కాకుండా బెనిఫిట్ షోలకు కూడా అనుమతి తెలుపుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఒక సామాన్యమైన వ్యక్తి తన కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లాలి అంటే సుమారు ₹2000 వరకు ఖర్చవుతుంది.

ఇలా సినిమా చూడటం కోసం 2000 ఖర్చు చేయాలి అంటే ఒక సామాన్య వ్యక్తి థియేటర్లో వెళ్లి సినిమా చూడటం మానేస్తారు.

"""/" / ఇక ఇదే విషయం గురించి అల్లు శిరీష్ మాట్లాడుతూ.హిందీ మాట్లాడే వారు 90 కోట్ల మంది ఉన్న మూడు కోట్ల మంది మాత్రమే సినిమా చూస్తారు.

కానీ మన తెలుగు వారు 10 కోట్ల మంది ఉన్న మూడు కోట్ల మంది సినిమా చూస్తారని తెలిపారు.

అక్కడ కంటే ఇక్కడే టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి కానీ మనం ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్ల బంగారు గుడ్డు పెట్టే బాతును మనమే చంపుకున్నట్టు అవుతుంది.

ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే బాగుంటుందని ఈయన తెలిపారు.ఇలా సినిమా టికెట్ల రేట్లు పెంచడం వల్ల సామాన్యులు థియేటర్లకు దూరం అవుతారని తద్వారా చిత్ర పరిశ్రమ దెబ్బతింటుంది అంటూ ఈయన ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు.

మరి ఈ విషయంపై సినీ పెద్దలు ఆలోచిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 10, గురువారం 2024