అయాన్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కిపోతుంది.. అల్లు శిరీష్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.
అల్లు రామలింగయ్య లెగసీ అల్లు అర్జున్( Allu Arjun ) కంటిన్యూ చేస్తూ వచ్చారు.
అల్లు అరవింద్ వారసులుగా అల్లు అర్జున్ తో పాటు అల్లు శిరీష్( Allu Sirish ) కూడా ఇండస్ట్రీలోకి హీరోలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందగా అల్లు శిరీష్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం పోరాటం చేస్తున్నారు.
ఇక త్వరలోనే అల్లు శిరీష్ నటించిన బడ్డీ( Buddy ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
"""/" /
ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగ అల్లు శిరీష్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్న సమయంలో అక్కడికి వచ్చిన అభిమానులు ఒక్కసారిగా అల్లు అయాన్( Allu Ayaan ) అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు.
దీంతో అల్లు శిరీష్ తనని తప్పకుండా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకువస్తానని అభిమానులకు మాట ఇచ్చారు.
"""/" /
ఇకపోతే మరి కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ కూడా తీసుకురావాలి అని చెప్పగా అన్నయ్యను తీసుకురావడం కోసం ట్రై చేస్తానని చెప్పారు.
ఇక అల్లు శిరీష్ మాట్లాడుతూ ఉండగా అభిమానులు మాత్రం అయాన్ అంటూ కేకలు వేయగా.
ఇంత చిన్న వయసులోనే అయాన్ క్రేజ్ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయాన్ ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఈయన తన చిలిపి చేష్టలు అల్లరి పనులతో భారీగా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
దీంతో అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు బయటకు వస్తే మొదట అయాన్ పైనే అందరి దృష్టి ఉంటుందని చెప్పాలి.
అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరంపై జెండా పాతిన ఎన్ఆర్ఐ జంట