అప్పగింతల సమయంలో చిరుతో అల్లు రామలింగయ్య చెప్పిన మాటేంటో తెలుసా?

అప్పగింతల సమయంలో చిరుతో అల్లు రామలింగయ్య చెప్పిన మాటేంటో తెలుసా?

చిరంజీవి.సురేఖ ఆదర్శ దంపతులుగా ఇప్పటికీ ఎంతో ప్రేమగా ఉంటారు.

అప్పగింతల సమయంలో చిరుతో అల్లు రామలింగయ్య చెప్పిన మాటేంటో తెలుసా?

పెళ్లి అయిన నాటి నుంచి ఇప్పటి వరకు వీరి మధ్య ఆప్యాయత కించిత్ కూడా తగ్గలేదు.

అప్పగింతల సమయంలో చిరుతో అల్లు రామలింగయ్య చెప్పిన మాటేంటో తెలుసా?

అయితే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగక ముందే.అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ గా కొనసాగాడు.

అప్పుడు తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేశాడు రామలింగయ్య.చిరంజీవిలో గొప్ప నటుడు అయ్యే సత్తా ఉందని గుర్తించిన అల్లు.

ఆయనకు తన బిడ్డను ఇచ్చి కన్యాదానం చేశాడు.అయితే చిరంజీవి అల్లు ఇంటి అల్లుడు కావడానికి జ‌య‌కృష్ణ కీలక పాత్ర పోషించాడు.

మ‌న‌వూరి పాండ‌వులు సినిమాలో అల్లు రామ‌లింగ‌య్య‌తో కలిసి తొలిసారి నటించాడు చిరంజీవి.కొంతకాలం తర్వాత తన మిత్రుడితో కలిసి అల్లు వారింటికి వెళ్లాడు చిరంజీవి.

ఆ సమయంలో రామలింగయ్య ఇంట్లో లేడు.ఆయన భార్య వచ్చి పలకరించి కాఫీ ఇచ్చి పంపించింది.

ఆ కాఫీ పెట్టింది మరెవరో కాదు సురేఖ.పెళ్లయ్యాక.

చిరంజీవి సురేఖతో అడిగాడట.ఆరోజు మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూశావా? అని అడిగాడట.

చూడలేదని చెప్పింది ఆమె.జ‌య‌కృష్ణ చిరుతో పాటు అల్లుకు మంచి సన్నిహితుడు.

ఆయనే ఈ పెళ్లి గురించి మాట్లాడాడు.ఆయన మధ్యవర్తిత్వంతో ఈ పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి.

"""/"/ అటు కైకాల సత్యనారాయణతో కూడా చిరంజీవి గురించి అల్లు రామలింగయ్య ఆరా తీశాడు.

తను కూడా చిరంజీవి గురించి చక్కగా చెప్పడంతో పెళ్లి ఫిక్స్ అయ్యింది.1980 ఫిబ్ర‌వ‌రి 20న‌ చిరంజీవి-సురేఖ పెళ్లి ఘనంగా జ‌రిగింది.

అమ్మాయిని చిరంజీవికి అప్పగించే సమయంలో అల్లు రామలింగయ్య ఓ మాట చెప్పాడు.చూడు బాబూ.

నువ్వేమో కాస్త స్పీడు.మా ఇంట్లో పిల్ల‌లంద‌రూ కచ్చితంగా మాట్లాడుతారు.

కానీ సురేఖ ఒక్కతే చాలా మెతక అమ్మాయి.బాగా చూసుకోవాలి అని చెప్పింది.

అనుకున్నట్లుగానే సురేఖను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు చిరంజీవి.ఇప్పటికీ తనను అద్భుతంగా చూసుకుంటున్నాడు కూడా.

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి…. వెల్లువెత్తుతున్న విమర్శలు?