అక్కడ అంబానీ బ్రదర్స్, ఇక్కడ అల్లు బ్రదర్స్.. సేమ్ స్టోరీ

అవును .మీరు చూస్తున్నది నిజమే.

అక్కడెక్కడో ముంబై లో ఉండే అంబానీ బ్రదర్స్ కి ఇక్కడ టాలీవుడ్ లో ఉండే అల్లు బ్రదర్స్ కి పోలిక ఏంటి అనుకుంటున్నారా ? ఒకటి కాదు, రెండు కాదు అనేకం ఉన్నాయ్.

అల్లు అర్జున్ బ్రదర్స్ విషయానికి వస్తే ఇద్దరు అల్లు ఫామిలీ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

అల్లు అర్జున్ ని మించిన క్రియేటివ్ బుర్ర, ఎనర్జీ, సెన్సాఫ్ హ్యూమర్ అన్ని ఉన్నాయ్.

కానీ లేనిది మాత్రం చింత గింజంత అదృష్టం మాత్రమే.అన్న అల్లు అర్జున్ మాత్రం కమర్షియల్ సినిమాలను తీస్తూ పాన్ ఇండియా స్టార్ అయితే అల్లు శిరీష్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది.

అన్నదమ్ములు అన్నాక ఇద్దరు సక్సెస్ అవ్వాలంటే ఎలా చెప్పండి.సేమ్ టూ సేమ్ .

అంబానీ బ్రదర్స్ కూడా.అన్న ఆకాశం లో ఉంటె తమ్ముడు పాతాళంలో ఉన్నాడు.

ఇక అల్లు అర్జున్ సక్సెస్ అవ్వడం లో ఆయనకు బాగా కలిసి వచ్చింది అతడి మాస్ స్టెప్పులు.

టాలీవుడ్ లో అల్లు అర్జున్ లాగ ఎవరు డ్యాన్స్ చేయలేరు.తాను ఆ విషయంలో ఎంతో హోమ్ వర్క్ మరియు హార్డ్ వర్క్ చేస్తాడు.

ఇక మాస్ లుక్ తో కూడిన రఫ్ అండ్ టఫ్ నటన కూడా బాగా సూట్ అయ్యింది అల్లు అర్జున్ కి.

మరి అల్లు శిరీష్ విషయానికి వస్తే మాస్ నటన సంగతి పక్కన పెట్టండి స్టెప్పులు వేయడం అతడికి అస్సలు చేత కాదు.

అందుకే కెరీర్ కుంటుకుంటూ పోతుంది. """/"/ అప్పుడెప్పుడో ఏ బి సి డి సినిమాతో వచ్చి మల్లి మూడేళ్లకు రాక్షసివో ఉర్వశివో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అది కూడా మూడేళ్ళ పాటు ఆగి ఆగి రిలీజ్ అయ్యింది.సినిమా పేరు మార్చుకొని మరి విడుదల అయ్యింది.

అయినా కూడా సినిమాలో ఏమి లేదు అని ప్రేక్షకులు తీర్పు ఇచ్చేసారు.అల్లు అరవింద్ లాంటి ప్రొడ్యూసర్ కొడుక్కు ఇలాంటి పరిస్థితి ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.

అందుకే అంబానీ బ్రదర్స్ తో పోల్చేది.అక్కడ అన్న కూడా వెలనుకోట్లు వెనక్కి వేసుకుంటూ కొత్త టెక్నాలజీని పెంచుతూ ముందుకు వెళ్తున్నాడు.

కానీ తమ్ముడు ఇచ్చిన ఆస్తులను పోగొట్టాడు.అప్పులతో రోడ్డున పడుతుంటే అన్న వచ్చి ఆడుకుంటే కానీ బ్రతకలేని స్థితి కి వచ్చాడు.

జాగ్రత్త పడకుంటే భర్తను కోల్పోవాల్సిందే…. సమంత సంచలన పోస్ట్ వైరల్!