Allu Ayaan: బాహుబలిలో ప్రభాస్ ఫోజులు ఇచ్చిన అల్లు అయాన్… ఫోటో వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఒకరు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఈయన పుష్ప సినిమా(Pushpa Movie )ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఈయన కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండగా తన పిల్లల బాధ్యతలను కుటుంబ బాధ్యతలను తన భార్య స్నేహ రెడ్డి(Sneha Reddy) చక్కబెడుతూ ఉంటారనే సంగతి మనకు తెలిసింది.
"""/" /
ఇక ఈమె సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటారు కానీ హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ స్నేహారెడ్డికి ఉంది.
ఇలా స్నేహారెడ్డికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈమె ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా అల్లు అర్జున్ అలాగే తన ఇద్దరు పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
దీంతో ఈమెను అనుసరించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉందని చెప్పాలి. """/" /
ఇక తన పిల్లలతో ఎన్నో రకాల వీడియోలను చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఇకపోతే తాజాగా తన కుమారుడు అల్లు అయాన్ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఇందులో భాగంగా అయాన్ (Allu Ayaan) రామోజీ ఫిలిం సిటీలోని బాహుబలి( Bahubali ) సెట్ లోకి వెళ్లారని తెలుస్తుంది.
అక్కడ బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో వేసినటువంటి సెట్ అలాగే ఉండడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు అక్కడికి వెళుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే అల్లు అయాన్ కూడా అక్కడికి వెళ్లారని తెలుస్తుంది. """/" /
బాహుబలి సినిమాలో ప్రభాస్( Prabhas ) ఏకంగా విల్లు ఎక్కు పెట్టి ఒకేసారి మూడు బాణాలను వదులుతూ ఉంటారు.
ఈ సీన్ సినిమాకి ఎంతో హైలెట్ గా మారిందని చెప్పాలి అయితే రామోజీ ఫిలిం సిటీలో విల్లు నుంచి మూడు బాణాలు బయటకు వస్తూ ఉన్నటువంటి ఒక బొమ్మను ఏర్పాటు చేశారు.
అయితే అక్కడ నిలబడి తానే బాణం గురి పెడుతున్నట్టు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
ప్రస్తుతం ఈ ఫోటోని అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో పై అల్లు ఫాన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.
ఢిల్లీ లో బాబు బిజీ బిజీ.. వీరందరితోనూ భేటీ