అల్లు అయాన్ చేతుల మీదుగా రామలింగయ్య విగ్రహావిష్కరణ?
TeluguStop.com
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటుడు అల్లు రామలింగయ్య( Allu Ramalingaiah ) ఒకరు.
ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తన వారసులుగా అల్లు అరవింద్ ను ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం చేశారు.
ఇక ఈయన వారసులుగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.
అల్లు రామలింగయ్య మరణించారు.ఇక గత ఏడాది అల్లు కుటుంబ సభ్యులు ( Allu Family ) ఈయన శత జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.
"""/" /
అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకల సందర్భంగా అల్లు స్టూడియోస్ కూడా ప్రారంభించారు.
ఇకపోతే తాజాగా ఈయన 101 జయంతి వేడుక కావడంతో అల్లు కుటుంబ సభ్యులు అల్లు బిజినెస్ పార్క్ లో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ విగ్రహాన్ని అల్లు అరవింద్ మనవడు అల్లు అర్జున్ కుమారుడు అయాన్( Ayaan ) చేత ఆవిష్కరింప చేశార.
ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు.
ఈ వేడుకలకు అల్లుఅర్జున్( Allu Arjun ) స్నేహ రెడ్డి ( Sneha Reddy )దూరంగా ఉన్నారు.
ప్రస్తుతం వీరిద్దరూ లండన్ వెకేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. """/" /
ఇక ఈ విగ్రహవిష్కరణ కార్యక్రమంలో భాగంగా అయాన్ విగ్రహావిష్కరణ చేయడమే కాకుండా అల్లు రామలింగయ్య గారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.
నేడు అల్లు రామలింగయ్య తాత గారి విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
ఇక తాతయ్య గారు మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయని తాతగారి దీవెనలు మాపై ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అల్లు అయాన్ మాట్లాడటంతో బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చరణ్ గేమ్ ఛేంజర్ రికార్డులు, విశేషాలు ఇవే.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?